ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలకు విద్య, వైద్యం ప్రభుత్వం బాధ్యత

ABN, Publish Date - Nov 21 , 2024 | 10:26 PM

పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు, ప్రమాణాలతో కూడిన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. గురువారం ఐబీ చౌరస్తా సమీపంలో రూ.324 కోట్ల అంచనా వ్యయంతో 650 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, మాతా శిశు కేంద్రానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో కలిసి భూమిపూజ, శిలాఫలకం ఆవిష్కరించారు.

మంచిర్యాల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు, ప్రమాణాలతో కూడిన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. గురువారం ఐబీ చౌరస్తా సమీపంలో రూ.324 కోట్ల అంచనా వ్యయంతో 650 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, మాతా శిశు కేంద్రానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో కలిసి భూమిపూజ, శిలాఫలకం ఆవిష్కరించారు. అనం తరం ఏర్పాటు చేసిన సభలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ మంచిర్యాల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వైద్య సేవలు మెరుగుపడతాయన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లకుండా 90 శాతం సేవలు స్థానికంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైద్యశాఖలో 7 వేలకుపైగా సిబ్బందిని నియమించామని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు అందుబాటులో ఉండేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ మండలానికి ఒక్కటి చొప్పున గిరిజన ప్రాంతాల్లో రెండేసి అంబులెన్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి 30 నుంచి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్‌ చొప్పున రాష్ట్రంలో 74 సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తర తెలంగాణలో నాలుగు క్యాన్సర్‌ సెంటర్లను ఏర్పాటు చేయనుండగా మంచిర్యాల జిల్లాకు ఒకటి కేటాయిస్తామన్నారు. వస్కులర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం జిల్లా కేంద్రంలో ఉన్న డయాలసిస్‌ కేంద్రంలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కోరిక మేరకు పడకల సంఖ్యను 10 నుంచి 30కి పెంచుతామని హామీ ఇచ్చారు. జన్నారం పీహెచ్‌సీని 6 నుంచి 30 పడకల సామర్థ్యానికి పెంచుతామన్నారు. మంచిర్యాల నియోజక వర్గంలోని వెంకట్రావుపేట, చెన్నూరు నియోజకవర్గంలోని అంగ్రాజ్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించడంతోపాటు 24 గంటలు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభత్వ హయాంలో తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో అబద్దాలు, మోసాలతోనే గడిచిందని, అందుకే ప్రజానీకం ప్రాంతీయ పార్టీకి చమరగీతం పాడారని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. రేవంత్‌ సర్కారు ఏర్పడగానే ఆరోగ్యశ్రీలో రేట్ల డివిజన్‌ చేపట్టి పథకం పరిధిని రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. ఇండ్ల స్థలాలు, ఇళ్లు, ఉద్యోగాలు ఇచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వమని ప్రతిపక్షం ఎందుకు విమర్శిస్తుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని, ప్రజా సంక్షేమం ఎక్కడా కానరాలేదని విమర్శించారు.

ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు పది నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందని అంటున్నారని అనైతికంగా, అడ్డగోలు విమర్శలు కాకుండా ప్రతిపక్ష హోదా పాటించాలని హితవు పలికారు. మీరు పదేళ్ల కాలంలో చేయలేనివి మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, వంట గ్యాస్‌పై రూ.500 సబ్సిడీ, రూ.10లక్షలతో ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్నామని అన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు కాస్మోటిక్స్‌ రేట్లు పదేళ్లలో పెంచలేకపోయారని, తాము పెంచి చూపించామన్నారు. రైతులకు రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశామని, సన్న బియ్యానికి రూ. 500 బోనస్‌ ఇస్తున్నామన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేశామని, సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఎక్కడో ఇద్దరికో, ముగ్గురికో అందలేదని గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మీరు రూ.లక్ష రుణమాఫీ విడుతల వారీగా చెల్లిస్తే, అవి వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. రాబోయే కాలంలో రైతులు, సింగరేణి కార్మికుల సంక్షేమం చేపడతామన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి డిసెంబరు 7 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిం చాలన్నారు. మంచిర్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురికాకుండా రూ.262 కోట్లతో కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటామ న్నారు. రూ. 40 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి చేసి, నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద అంతర్గత రహదారులను నిర్మిస్తూ మండల, జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేస్తామని, జిల్లాలో పారిశ్రామిక వాడల అభివృద్ధి, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ఏర్పాటుతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తామని తెలిపారు. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొదటిసారిగా మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లిలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఉత్తర తెలంగాణలోనే చరిత్ర సృష్టిస్తుందన్నారు. ఆసుపత్రి ద్వారా దాదాపు 15 లక్షల మందికి మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు రూ.324 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్మింహాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆ నిధులతో 225 పడకలతో మాతా శిశు, 425 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్‌ బొర్కడే, జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, తెలంగాణ మినిమం వేజెస్‌ బోర్డు చైర్మన్‌ జనక్‌ ప్రసాద్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. హరీష్‌రాజ్‌, మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ సులేమాన్‌, మంచిర్యాల, నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్లు రావుల ఉప్పలయ్య, సురిమిల్ల వేణు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణాధ్యక్షుడు తూముల నరేష్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 10:26 PM