ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలి

ABN, Publish Date - Aug 30 , 2024 | 10:34 PM

వసతి గృహాల్లోని విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్ర వారం తాళ్లగురిజాలలోని తెలంగాణ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల, జూనియర్‌ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలను సందర్శించారు.

బెల్లంపల్లి, ఆగస్టు 30: వసతి గృహాల్లోని విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్ర వారం తాళ్లగురిజాలలోని తెలంగాణ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల, జూనియర్‌ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలున్నాయా అని తెలుసుకున్నారు. భోజనం చేసే సమ యంలో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్ధ మయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందించాల న్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. ప్రశ్నలు వేసి సమాధానాలను విద్యార్థులతో బోర్డుపై రాయించారు.

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

మంచిర్యాల కలెక్టరేట్‌: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాల ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయకర్త నాగే శ్వర్‌రావు, జోనల్‌ అధికారి ఆరుణకుమారితో కలిసి టీజీఎస్‌డబ్య్లూఆర్‌ఎస్‌ ప్రిన్సి పాళ్లు, కరెస్పాండెంట్‌లు, భవనాల యజమానులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్యాబో ధన అందించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేసి సురక్షిత భవ నాలకు తరలించాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తన తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 10:34 PM

Advertising
Advertising