వయోవృద్ధుల సంక్షేమం ప్రతీ ఒక్కరి బాధ్యత
ABN, Publish Date - Oct 01 , 2024 | 10:10 PM
వయోవృద్ధు ల సంక్షేమం, పోషణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సమీ కృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మంది రంలో వయోవృద్ధుల దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 1: వయోవృద్ధు ల సంక్షేమం, పోషణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సమీ కృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మంది రంలో వయోవృద్ధుల దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వయోవృద్ధు లను ఘనంగా సన్మానించారు. కలెక్టర్ మాట్లాడు తూ ఎన్నో త్యాగాలు, అనుభవాలతో నిరంతరం కుటుంబ సంక్షేమాన్ని కాంక్షించే వృద్ధుల పోషణ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుం దని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి స్వరూపరాణి, డీఆర్‌డీవో కిషన్, ఏసీపీ ప్రకాష్, డీఎంహెచ్‌వో అని త, జిల్లా సమన్వయకర్త సౌజన్య, డీసీపీవో ఆనంద్, సీడీపీలు, వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రతిని ధులు పాల్గొన్నారు.
గర్మిళ్ల: మంచిర్యాలలోని రాముని చెరువు వద్ద వాకర్స్ అసోసియేషన్ నాయకులు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. కేక్‌కట్ చేసి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అధ్య క్షుడు గజెల్లి వెంకటయ్య, తహసీల్దార్ కృష్ణకమ ల్‌సింగ్, ఎంఈవో మల్లేశం, ఉపాధ్యక్షుడు ఆకుల సత్తన్న, తాళిబ్‌ఖాన్, మనోహర్, రెడ్డన్న, అంజన్న, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
దండేపల్లి: సమాజానికి మార్గ నిర్దేశం చేసే వారు వృద్ధులేనని గుడిరేవు ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయుడు బొలిశెట్టి బుచ్చన్న అన్నారు. పాఠ శాలలో వృద్ధదేవోభవ కార్యక్రమాన్ని నిర్వహించి వృద్ధులను సన్మానించారు. ఉపాధ్యాయురాలు శ్యామల, అంగన్‌వాడి టీచర్ లక్ష్మి, ఏఎన్‌ఎం మనోహర పాల్గొన్నారు.
Updated Date - Oct 01 , 2024 | 10:10 PM