ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి విడుదల

ABN, Publish Date - Sep 03 , 2024 | 10:39 PM

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నీటిని ప్రణాళికబద్దంగా నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్ర మలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. మంగళవారం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న నీటిని పరిశీలించారు. మంత్రి మాట్లాడు తూ గోదావరి నది పరివాహక ప్రాంంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రాజె క్టు నుంచి ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారన్నారు.

హాజీపూర్‌, సెప్టెంబరు 3: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నీటిని ప్రణాళికబద్దంగా నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్ర మలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. మంగళవారం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న నీటిని పరిశీలించారు. మంత్రి మాట్లాడు తూ గోదావరి నది పరివాహక ప్రాంంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రాజె క్టు నుంచి ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారన్నారు. అధికార యంత్రాం గం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలు అందిస్తున్నారన్నారు. ప్రజలకు అత్యవసర సేవల నిమిత్తం అధికారులను సంప్రదించాలన్నారు. అధికారు లు చేపడుతున్న రక్షణ చర్యలకు ప్రజాప్రతినిధులు పూర్తిగా సహకరించాలని తెలి పారు. ప్రాజెక్టు సమీపంలోని 70 ఎకరాలను పర్యాటక ప్రాంతానికి వినియోగిస్తామ న్నారు. ప్రాజెక్టు పనులు పూర్తికావడంతో త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో ప్రారంభించేం దుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్‌లు కుమార్‌ దీపక్‌, కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ ఠాకూర్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, డీసీపీ భాస్కర్‌, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు రాములు, హరికృష్ణ, ఏసీపీ ప్రకాష్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌దేశ్‌పాండే, ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌రెడ్డి, ఇంజనీర్లు పాల్గొన్నారు.

రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ : ఎమ్మెల్యే వివేక్‌

చెన్నూరు: అన్నారం బ్యాక్‌ వాటర్‌తో పంటలు నీట మునిగి నష్టపోతున్న రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేసిందని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంక టస్వామి అన్నారు. సుందరసాల సమీపంలోని అన్నారం బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌తో మునిగిన పంటలను మంగళవారం పరిశీలించారు. సుందరసాల, వెంకంపేట గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించి అధికారులు, రైతులతో మాట్లాడారు. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. పంటలు నీట మునగకుండా కరకట్టల నిర్మా ణానికి ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు కమీషన్‌లు దండుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించి మంచిర్యాల, చెన్నూరు, మంథని, భూపాలపల్లి నియోజక వర్గాల్లో వేల ఎకరాల్లో పంటలు నీటిలో మునిగిపోవడానికి కారణమయ్యారని పేర్కొ న్నారు. మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజరెడ్డి, తహసీల్దార్‌ మల్లికార్జున్‌, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు. చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే పలు కాలనీల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజలను సమస్యలు తెలుసుకున్నారు.

Updated Date - Sep 03 , 2024 | 10:39 PM

Advertising
Advertising