ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక

ABN, Publish Date - Sep 17 , 2024 | 10:54 PM

ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను మంగళవారం నిర్వహించారు. 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు రూ. 6.49 కోట్లతో జరిగిన వివిధ పనులపై బృందాలు తనిఖీలు నిర్వహించారు.

చెన్నూరు, సెప్టెంబరు 17: ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను మంగళవారం నిర్వహించారు. 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు రూ. 6.49 కోట్లతో జరిగిన వివిధ పనులపై బృందాలు తనిఖీలు నిర్వహించారు. డీఆర్‌డీవో కిషన్‌ పలు అంశాలపై మాట్లాడారు. సభ్యులు తనిఖీ నివేదికలను అధికారు లకు చదివి వినిపించారు. పంచాయతీ కార్యదర్శులు, టీఏలు సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్నారు. పలు గ్రామాల్లో అన్ని రిజిష్టర్‌లను మెయింటన్‌ చేయడం లేదని తెలిపారు. అనంతరం డీఆర్‌డీవో కిషన్‌ మాట్లాడుతూ తనిఖీల్లో నిర్లక్ష్యం చేసిన కార్యదర్శులకు జరిమానాలు విధిం చినట్లు తెలిపారు. రికార్డుల పరంగా రూ.51,131 పెనాల్టీ రీకవరీకి ఆదే శించారు. ఎంపీడీవో మోహన్‌, ఎంపీవో అజ్మత్‌ఆలీ, ఏపీవో గంగాభవాణీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 10:54 PM

Advertising
Advertising