ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గడువు ముగిసినా చేరని సీఎంఆర్‌ లక్ష్యం

ABN, Publish Date - Oct 01 , 2024 | 10:18 PM

ప్రభుత్వం అందజేసిన ధాన్యా న్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో రైస్‌మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్యధోరణి అవలంభిస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసినప్పటికీ లక్ష్యం మేరకు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ఇవ్వని మిల్లులపై చర్య లకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

మంచిర్యాల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందజేసిన ధాన్యా న్ని మరాడించి బియ్యంగా మార్చి తిరిగి అప్పగించడంలో రైస్‌మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్యధోరణి అవలంభిస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసినప్పటికీ లక్ష్యం మేరకు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ఇవ్వని మిల్లులపై చర్య లకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఆయా సీజన్లలో పౌర సర ఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కేటాయించిన మిల్లులు సకాలంలో బియ్యం అందించాలని ఆదేశిస్తున్నా పట్టించుకోకపోవడంతో కఠిన చర్య లకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సెప్టెంబరు 30 లోపు బియ్యం అప్పగిం చాలని ప్రభుత్వం హెచ్చరించినా మిల్లర్ల నుంచి స్పందన రాలేదు. చాలా మంది మిల్లర్లు పలు కారణాలు చెబుతూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.

సీజన్ల వారీగా మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, తిరిగి ఇవ్వాల్సిన బియ్యం వివరాలు మెట్రిక్‌ టన్నుల్లో....

సంవత్సరం సీజన్‌ ధాన్యం ఇవ్వాల్సిన బియ్యం పెండింగ్‌

2022-23 ఖరీఫ్‌ 40470.78 7308.583 2217.552

2022-23 రబీ 92169 26449 6716

2023-24 ఖరీఫ్‌ 139664 94057 39473

2023-24 రబీ 85266.520 57748 33600

ధాన్యం పక్కదారి

జిల్లా వ్యాప్తంగా రైస్‌మిల్లులకు అప్పగించిన ధాన్యం పక్కదారి పడుతుందనే ఆరోపణలున్నాయి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీఎంఆర్‌ ఇచ్చే సమయంలో రేషన్‌ బియ్యాన్నే కొనుగోలు చేసి తిరిగి అప్పగిస్తు న్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీ సమయంలో నిల్వలు చూపించాల్సి రావడంతో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎంఆర్‌గా చూపుతున్న ట్లు తెలుస్తోంది. ఎఫ్‌సీఐ అధికారులు పరిశీలన సమయంలోనూ లెక్కలు చూపించకుండా కొందరు మిల్లర్లు తప్పించుకుంటున్నారు. గతంలో కొన్ని మిల్లుల్లో రేషన్‌ బియ్యం పట్టుబడటమే దీనికి నిదర్శనం. అలాగే ఒక్కొక్కరికి రెండేసి చొప్పున మిల్లులు ఉండగా, గత కొన్నేళ్లు ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతో కోట్లకు పడగలెత్తుతున్నారు. వీటన్నింటి పైనా విచారణ జరపాలని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా ఆచరణ సాధ్యం కాలేదు.

కేసులు నమోదవుతున్నా మారని తీరు

సీఎంఆర్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లపై జరిమానాలు, కేసులు విధిస్తున్నా వారి తీరు మారడం లేదు. ప్రతీ సీజన్‌లో ప్రభుత్వమే రైతుల నుంచి మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుపుతోంది. ధాన్యాన్ని జిల్లాలో ఉన్న మిల్లులకు కేటాయిస్తే మిల్లర్లు సీఎంఆర్‌ చేసి తిరిగి అందించాలి. బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తే రేషన్‌ షాపుల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అయితే ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు బియ్యం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో జైపూర్‌లోని ఓ మిల్లుపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. 2021-22లో యాసంగి ధాన్యం సీఎంఆర్‌ ఇవ్వకుండా అలసత్వం వహించిన 19 మిల్లులకు రూ.51 కోట్లు జరిమానా విధించారు. మళ్లీ 2022-23లో ఖరీఫ్‌ సీజన్‌కు చెందిన సీఎంఆర్‌ సకాలంలో అప్పగించని 20 మిల్లుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. 2023-34 రబీ, వానాకాలం సీజన్లకు సంబంధించి 42 శాతమే బియ్యం అప్పగించారు. బియ్యం ఇవ్వని మిల్లులకు జరిమానా, వడ్డీ కలిపి చెల్లించాలంటూ ప్రభుత్వం నుంచి ఆదే శాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ చాలా మంది మిల్లర్లు చెల్లించడం లేదు. తాజాగా గత వానాకాలం, యాసంగి కూడా పెండింగ్‌లో ఉండడం గమనార్హం. అయితే రా రైస్‌ మిల్లర్లు తమకు నష్టం వస్తోందనే పేరుతో సీఎంఆర్‌ బకాయిలు ఇవ్వకపోగా, బాయిల్డ్‌ మిల్లర్లు మాత్రం దాదాపుగా సీఎంఆర్‌ అప్పగిస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తాం

సబావత్‌ మోతీలాల్‌, అదనపు కలెక్టర్‌

సీఎంఆర్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించే మిల్లర్ల నుంచి రికవరీ చేస్తాం. ఇప్పటికే రెండు మిల్లులపై కేసులు నమోదు చేశాం. మరో ఐదు మిల్లులపైనా చర్యలు తీసుకొంటాం. బియ్యం రికవరీ కోసం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేసేందుకు వెనుకాడం. అవసరమైతే మిల్లర్ల కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకూ చర్యలు చేపడతాం.

Updated Date - Oct 01 , 2024 | 10:18 PM