ఫ్యామిలీ కార్డు సర్వే నివేదిక స్పష్టంగా ఉండాలి
ABN, Publish Date - Oct 05 , 2024 | 10:21 PM
ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే నివేదిక స్పష్టంగా రూపొందించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రత్యేకాధికారి, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 5: ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే నివేదిక స్పష్టంగా రూపొందించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రత్యేకాధికారి, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియలో సందేహాలు, పొరపాట్లు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకుని స్పష్టమైన నివేదిక రూపొందించాలన్నారు. సర్వే పూర్తయిన తర్వాత ఈ నెల9న వివరాలను పరిశీలించి నివేదిక అందించాలన్నారు.
ఒక కుటుంబానికి ఒకే కార్డు ఉంటుందని, కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఒక ప్రత్యేక నెంబరు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నింటికి ఒకే కార్డు అనుసంధానమై ఉంటుందన్నారు. మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను తొలగించి నూతనంగా వచ్చిన వారి పేర్లు నమోదు చేయాలన్నారు. సర్వే గురించి ప్రజలందరికి తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు రాములు, హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవో పాల్గొన్నారు.
Updated Date - Oct 05 , 2024 | 10:22 PM