ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:03 PM

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యు) ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు.

నస్పూర్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యు) ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. అంతకు ముందుగా నాయకులు ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చి ప్రధాన ద్వారం ఎదుట ఽబైఠాయించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు అందజేశారు.

పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీకాంత్‌ మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలను విడుదల చేయాలన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. కేజీబీవీ హాస్టల్‌ పాఠశాల విద్యార్థులకు మెస్‌ కాస్మోటిక్స్‌ చార్జీలు పెంచాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని,. లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తోందని హెచ్చరించారు. పీడీఎస్‌యు జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్‌, జిల్లా సహాయ కార్యదర్శి సండ్ర తిరుపతి, నాయకులు కార్తీక్‌, విజయ్‌, రాహూల్‌, పీవైఎల్‌ రాష్ట్ర నాయకులు మనోహర్‌లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:03 PM