ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంసీహెచ్‌కు పొంచి ఉన్న వరద ముంపు

ABN, Publish Date - Sep 02 , 2024 | 10:42 PM

భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ఆ నీటిని దిగువకు వదులుతుండటంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీరంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్‌)కి వరద ముంపు ప్రమాదం నెలకొంది. దీంతో సోమవారం అధికారులు అప్రమత్తమై ఆసుపత్రిలోని గర్భిణులు, బాలిం తలను ఐబీ ప్రాంతంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)కి తరలించారు.

మంచిర్యాల అర్బన్‌, సెప్టెంబర్‌ 2: భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ఆ నీటిని దిగువకు వదులుతుండటంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీరంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్‌)కి వరద ముంపు ప్రమాదం నెలకొంది. దీంతో సోమవారం అధికారులు అప్రమత్తమై ఆసుపత్రిలోని గర్భిణులు, బాలిం తలను ఐబీ ప్రాంతంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)కి తరలించారు. అధికారుల సూచనల మేరకు పేషెంట్లు, వారి సహాయకులు వారి వెంట తెచ్చుకున్న సామ గ్రితో వెళ్లారు. 102, 108 ఆంబులెన్స్‌ల ద్వారా గర్భిణులు, బాలింతలను, వారి సహాయకులను ఆర్టీసీ బస్సుల్లో తరలిం చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ హరీష్‌ రాగ్‌ పరిశీలించారు. ఆసుపత్రిలో 130 మంది ఇన్‌ పేషెంట్లు ఉన్నా రని, వారందరిని జీజీహెచ్‌కు తరలించామన్నారు. వీరందరిని అక్కడకు తరలించడం వల్ల జీజీహెచ్‌ ఇరుకుగా మారను న్నందున ఇదివరకు అక్కడ చికిత్స పొందుతున్న కొంతమంది పేషెంట్లను 10 ప్రైవేటు ఆసుపత్రులకు తరలించామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు తరలించిన పేషెంట్లందరికీ ప్రభుత్వ పరంగానే వైద్యం అందుతుందన్నారు.

యేటా ఇదే తంతు

గోదావరి నదీతీరంలో రూ.17.80 కోట్లు వెచ్చించి నిర్మించిన మాతా శిశు ఆసుపత్రికి యేటా వరద ముంపు పొంచి ఉం టోంది. నాలుగేళ్ళుగా వర్షాకాలం వచ్చిందంటే చాలు ముంపు భయంతో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలను తరలించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వర్షాకాలం సీజన్‌ మొత్తం ఎంసీహెచ్‌ను మూసి ఉంచడం, అందులోని పేషెం ట్లకు జీజీహెచ్‌లో చికిత్స అందించడం పరిపాటిగా మారింది. జీజీహెచ్‌ ఆసుపత్రి సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Sep 02 , 2024 | 10:42 PM

Advertising
Advertising