గడ్డం వెంకటస్వామి సేవలు మరువలేనివి
ABN, Publish Date - Oct 05 , 2024 | 10:24 PM
మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి సేవలు మరువలేనివని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, డీఆర్‌డీవో కిషన్‌లతో కలిసి పాల్గొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 5: మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి సేవలు మరువలేనివని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, డీఆర్‌డీవో కిషన్‌లతో కలిసి పాల్గొన్నారు. వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ వెంకటస్వామి 7 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, 2 సార్లు శాసనసభ్యులుగా ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు. వెంకటస్వామి ట్రస్టు ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేశారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశారని తెలిపారు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్: మున్సిపల్ కార్యాలయంలో దివంగత మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. కౌన్సిలర్లు, కార్యాలయ మేనేజర్ విజయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. టీఎన్‌జీవో కార్యాలయం లో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతి నిర్వహించారు. కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సం ఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి ఎ.సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో కాకా వెంకట స్వామి జయంతి నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ళ వేణు, కమిషనర్ చిట్యాల సతీష్, ఆర్‌ఓ శ్రీనివాస్, ఏఈ మధు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐలు మాంతయ్య, చందర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మందమర్రి టౌన్: కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మంద మర్రిలో కాకా జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మంద తిరుమల్‌రెడ్డి, కడారి శ్రీనివాస్, పైడిమల్ల నర్సింగ్, నర్సోజి, కిరణ్‌లు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. పాత బస్టాండ్‌లో కాకా చిత్రపటానికి నోముల ఉపేందర్‌గౌడ్, సొత్కు సుదర్శన్‌లు పూల మాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం నిర్వహించారు. అనంతరం ఉపేందర్ గౌడ్, సుదర్శన్‌లు మాట్లాడుతూ కాకా నిస్వార్ధ రాజకీయాలతో ప్రజల గుండెల్లో నిలిచార న్నారు. బత్తుల రమేష్, గడ్డం రజిని, నెర్వెట్ల శ్రీనివాస్, కడారి జీవన్, నర్సోజి, సట్ల మహేందర్, రాచర్ల గణేష్, రమేష్ పాల్గొన్నారు.
Updated Date - Oct 05 , 2024 | 10:24 PM