ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెల్లంపల్లి పట్టణ ప్రజలకు గోదావరి నీరందిస్తా

ABN, Publish Date - Sep 09 , 2024 | 10:35 PM

బెల్లంపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి కోసం గోదావరి నీటిని అందిస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. సోమవారం ఎల్లంపల్లి, బెల్లంపల్లిలోని తాగునీరు సరఫరా చేసే పంప్‌ హౌజ్‌లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్‌ పథకంలో భాగంగా రూ.61 కోట్ల నిధులతో ఎల్లంపల్లి నుంచి బెల్లం పల్లికి గోదావరి నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొ న్నారు.

బెల్లంపల్లి, సెప్టెంబరు 9: బెల్లంపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి కోసం గోదావరి నీటిని అందిస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. సోమవారం ఎల్లంపల్లి, బెల్లంపల్లిలోని తాగునీరు సరఫరా చేసే పంప్‌ హౌజ్‌లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్‌ పథకంలో భాగంగా రూ.61 కోట్ల నిధులతో ఎల్లంపల్లి నుంచి బెల్లం పల్లికి గోదావరి నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొ న్నారు. ఎన్నో ఏండ్లుగా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని సమస్య పరిష్కారానికి గోదావరి నీటిని సరఫరా చేసేం దుకు పబ్లిక్‌ హెల్త్‌ అధికారులతో మాట్లాడానని తెలిపారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలి పారు. అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు.

మాదక ద్రవ్యాల నివారణ అందరి బాధ్యత

మాదక ద్రవ్యాల నివారణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ పేర్కొన్నారు. బెల్లంపల్లి బ్రహ్మకుమారీస్‌ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రాజెక్టు కరీంనగర్‌ జోన్‌ ఇన్‌చార్జీ బ్రహ్మకుమారీ మనీషా మాట్లాడుతూ యువత డ్రగ్స్‌ బారిన పడి జీవి తాలను నాశనం చేసుకోవద్దన్నారు. పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాల, బజార్‌ ఏరియా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలుర గురుకుల పాఠశా లలలోని విద్యార్థులకు డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిం చారు. ఏసీపీ రవికుమార్‌, రూరల్‌ సీఐ అప్జలొద్దీన్‌, వన్‌టౌన్‌ సీఐ దేవయ్య, బ్రహ్మకుమారీలు పద్మ, కైవల్య తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

నెన్నెల: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మండల కేం ద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. 33 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆర్డీవో హరికృష్ణ, పార్టీ మండల అధ్య క్షుడు గట్టు మల్లేష్‌, నాయకులు బొమ్మెన హరీష్‌గౌడ్‌, శంకర య్య, తోట శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కన్నెపల్లి: కన్నెపల్లి రైతు వేదికలో 41 మంది లబ్ధిదారులకు కల్యా ణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశా రు. నియోజకర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌, ఎంపీడీవో గంగామోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 10:35 PM

Advertising
Advertising