ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాణ్యమైన ధాన్యం తీసుకవచ్చి మద్దతు ధర పొందాలి

ABN, Publish Date - Nov 29 , 2024 | 10:48 PM

కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ సూచించారు. చింతపల్లి, నెల్కివెంకటాపూర్‌ గ్రామాల్లోని కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లా డుతూ కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సి బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.

దండేపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ సూచించారు. చింతపల్లి, నెల్కివెంకటాపూర్‌ గ్రామాల్లోని కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లా డుతూ కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సి బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్‌ ఇస్తా మన్నారు. కొనుగోలు చేసిన వెంటనే రైతుల వివరాలు ట్యాబ్‌లలో నమోదు చేయా లని సూచించారు. కేంద్రాల లో నీడ, తాగునీరు, గన్నిసం చులు, టార్పాలిన్లు కవర్స్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డీపీఎం వేణు గోపాల్‌, ఐకేపీ ఏపీఎం భూపతి బ్రహ్మయ్య, సీసీలు, వీవోఏలు, గ్రామైఖ్య సంఘాల లీడర్లు, పాల్గొన్నారు.

నెన్నెల, (ఆంధ్రజ్యోతి): రైతులు కొనుగోలు కేంద్రా లకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొం దాలని భీమిని ఏడీఏ సురేఖ అన్నారు. మన్నెగూడం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శిం చారు. సన్నరకం ధాన్యానికి రూ.500లు బోనస్‌ ఇస్తున్నా మన్నారు. పొలం మొత్తం ఎండిన తర్వాతనే కోయాలని, కళ్లాల్లోనే ధాన్యం ఆరబెట్టుకొని సెంటర్లకు తీసుకురావా లన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు కొనుగోలు పత్రాలు అందజేయాలని సూచించారు. ఓపీఎంఎస్‌ ట్యాబ్‌లో వివరాలు నమోదు చేసిన 48 గంటల్లో ధా న్యం డబ్బులు జమచేస్తామన్నారు. ఏఈవో రామ్‌చం దర్‌, సెంటర్‌ ఇన్‌చార్జీ తిరుపతి ఉన్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

జైపూర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార సంఘం ఇన్‌స్పెక్టర్‌ పుష్పలత పేర్కొన్నారు. మిట్టపల్లి గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లా డారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్‌ ప్రభుత్వం ప్రకటిం చిందన్నారు. పీఏసీఎస్‌ సీఈవో అర్జున్‌, కేంద్రం ఇన్‌చార్జీ శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.

చెన్నూరు, (ఆంధ్రజ్యోతి): పొన్నారంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పీఏసీ ఎస్‌ సెక్రెటరీ రత్న లక్ష్మీనారాయణరెడ్డి, ఏవో యామిని ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపో కుండా కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 10:48 PM