ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN, Publish Date - Nov 16 , 2024 | 10:23 PM
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి అన్నారు. శనివారం దేవాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో 32 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
కాసిపేట, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి అన్నారు. శనివారం దేవాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో 32 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తుందని, ఈ కాలంలో ప్రజా, రైతులు, మహిళల కోసం కృషి చేసిందన్నారు. రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, మాజీ ఎంపీటీసీ మేరుగు పద్మశంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, గుండ శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
బెల్లంపల్లి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం వంద పడకల ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే కుమార్తె గడ్డం వర్ష ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తామని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రత్యేక వైద్య బృందాలను తీసుకువచ్చి బీపీ, షుగర్, కంటి, ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. కంటి పరీక్షల్లో సమస్య ఎక్కువగా ఉన్న వారికి అద్దాలు అందిస్తామన్నారు. ఆపరేషన్‌లను కూడా ఉచితంగా జరిపిస్తామని పేర్కొన్నారు. అనంతరం శిబిరానికి వచ్చిన వారికి భోజనాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కుల శ్వేత, నెన్నెల మాజీ ఎంపీటీసీ హరీష్‌గౌడ్, ఆర్డీవో హరికృష్ణ, నాయకులు బండి ప్రభాకర్, నాతరి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 10:23 PM