ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువు
ABN, Publish Date - Oct 17 , 2024 | 11:51 PM
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువై విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభు త్వాలు మారినప్పుడల్లా పనులు నిలిచిపోతుండడంతో సమస్యలకు పరిష్కా రం లభించడం లేదు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పథకం అర్థాంత రంగా నిలిచిపోవడంతో పనులు నిలిచిపోయాయి.
మంచిర్యాల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువై విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభు త్వాలు మారినప్పుడల్లా పనులు నిలిచిపోతుండడంతో సమస్యలకు పరిష్కా రం లభించడం లేదు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పథకం అర్థాంత రంగా నిలిచిపోవడంతో పనులు నిలిచిపోయాయి. మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొత్తం 248 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, భోజనశాల, ఫర్నిచర్ తదితర పనులు చేప ట్టాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన వాటిలో 112 పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టారు. మిగతా 136 స్కూళ్లలో పనులు పెండింగులో ఉన్నాయి. పనులు పూర్తయిన వాటిలో సగభాగం పాఠశాలలకు సంబం ధించి నిధులు ఇంతవరకు విడుదల కాలేదు.
ఫ రూ. 58 కోట్ల 36 లక్షలు
మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడిలో భాగంగా జిల్లాకు రూ.58 కోట్ల 36 లక్షలు మంజూరు కాగా ఇప్పటి వరకు అయిన పనులకుగాను రూ.17 కోట్ల 9 లక్షలు విడుదల అయ్యాయి. ఇంకా రూ.26 కోట్ల పనులు పూర్తయినందున వాటికి ఎంబీ రికార్డులు చేసిన్పటికీ నిధులు విడుదల కాలేదు. ఆ పనులను అప్పటి సర్పంచులు చేపట్టగా, ప్రభుత్వం మారడంతో అప్పుతెచ్చి పూర్తి చేసిన పనులకు బిల్లులు రాకుండా పోయాయి. ఇదిలా ఉండగా పనులు అసంపూర్తిగా ఉన్న 136 పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. పనులను కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా వదిలిపెట్టడంతో మొండి గోడలు, అసంపూర్తి టాయిలెట్స్ దర్శనమిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పనులు చేపట్టాలని నిర్ణయించింది. జిల్లాలో 478 పాఠశాలలను ఎంపిక చేశారు. పనులు వేగంగా జరుగుతుండటంతో ఎంపిక చేసిన వాటిలో 90 శాతం పాఠశాలల్లో పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఆ పనులకు సంబంధించి మొత్తం రూ.16 కోట్ల వ్యయం అంచనా వేయగా అందులో కేవలం 50 శాతం మాత్రమే నిధులు మంజూరయ్యాయి. మిగతా నిధులు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ల ద్వారా నివేదికలు పంపాల్సి ఉంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇంకా 20 శాతం మేర పనులు చేపట్టవలసి ఉంది. నిధులు విడుదలైతేగానీ పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోని ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమం కింద జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలను కాంగ్రెస్ పథకం ‘అమ్మ ఆదర్శ పాఠశాల’కు ఎంపిక చేయలేదు. ఆ సమయంలో ఎంపిక చేసిన 248 పాఠశాలల నుంచి పనులు పూర్తిగాని 136 స్కూళ్ల వైపు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అసంపూర్తిగా వదలివేసిన పనులు అలాగే ఉండగా, కొత్త పథకానికి ఎంపిక కాకపోవడం వల్ల విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
ఉదాహరణకు మంచిర్యాల జిల్లాలోని ఎంపీపీఎస్ కన్నెపల్లి పాఠశాలను గతంలో ‘మన ఊరు-మనబడి’ పథకానికి ఎంపిక చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం బాత్‌రూంలు నిర్మించాలని నిర్ణయించారు. గోడలు పూర్తయినప్పటికీ అందులో ఇతరత్రా పనులు చేపట్టలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల పథకానికి ఎంపిక చేయకపోవడంతో ఆ పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈ పాఠశాలలో జిల్లాలోని ప్రైమరీ స్కూళ్లలో 154 మంది విద్యార్థులు ఉన్నారు.
ఫ కన్నెపల్లి మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు గదులు నిర్మించాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్ హయాంలోని మన ఊరు- మన బడి కార్యక్రమానికి పాఠశాలను ఎంపిక చేశారు. పిల్లర్ల దశలో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ పాఠశాల సైతం ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పథకానికి ఎంపిక కాలేదు. దీంతో అదనపు గదుల పనులు ముందుకు సాగడం లేదు.
Updated Date - Oct 17 , 2024 | 11:51 PM