ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, Publish Date - Nov 19 , 2024 | 10:12 PM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. మండలం లోని రాంపూర్‌, తిమ్మాపూర్‌, తపాలాపూర్‌, రోటిగూడ, పొన్కల్‌, రేండ్లగూడ, దేవునిగూడ, కవ్వాల్‌, మొర్రిగూడ గ్రామాల్లో కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించారు.

జన్నారం, నవంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. మండలం లోని రాంపూర్‌, తిమ్మాపూర్‌, తపాలాపూర్‌, రోటిగూడ, పొన్కల్‌, రేండ్లగూడ, దేవునిగూడ, కవ్వాల్‌, మొర్రిగూడ గ్రామాల్లో కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతు అభివృద్ధికి రెండు లక్షల రుణమాఫీ ప్రక టించిన ఘనత కాంగ్రెస్‌ది అన్నారు. కిష్టాపూర్‌ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉప కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యం అందు తుందన్నారు. కవ్వాల్‌ గ్రామంలో ఇటీవల మరణించిన జునుగురి ప్రవీణ్‌ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. తహసీల్దార్‌ రాజమనోహర్‌ రెడ్డి, ఏవో సంగీత, ఏఈవో అక్రం, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముజాఫర్‌ఆలీ, నాయకులు పసివుల్లా, అల్లం రవి, సయ్యద్‌ ఇస్సాక్‌, ఇందయ్య పాల్గొన్నారు.

రాష్ర్టాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం నిరంతరంగా శ్రమిస్తుందని ఎమ్మెల్యే అన్నా రు. జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపా లన విజయోత్సవాలు నిర్వహించగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరు స్తుందని, ఉచిత బస్సు, కరెంటు, రుణ మాఫీ, స్వయం సహాయక సంఘాలకు నిధులతో పాటు ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందన్నారు.

ఆశా కార్యకర్తల వినతి

ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు మండల ఆశా కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. ఆశా కార్యకర్తలు మాట్లా డుతూ నెలకు రూ.18 వేల వేతనం అందజేయాలని, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పోస్టులు సంబంధించిన ఆశాలకు వెయిటేజ్‌ మార్కులు ప్రకటించాలని వినతి పత్రం అందజేయగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Nov 19 , 2024 | 10:12 PM