ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Oct 05 , 2024 | 10:19 PM
వానాకాలం సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, డీఆర్‌డీవో కిషన్, పౌరసరపరాల అధికారి బ్రహ్మరావుతో కలిసి కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు, సీఈవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 5 : వానాకాలం సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, డీఆర్‌డీవో కిషన్, పౌరసరపరాల అధికారి బ్రహ్మరావుతో కలిసి కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు, సీఈవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సహకార సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై తీర్మానం చేసి వివరాలను సమర్పించాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అర్హత గల వారిని నియమించాలని సూచించారు. కేంద్రంలో 20 టార్పాలిన్‌లు, ఒక మాయిశ్చర్ మీటర్, ఎలక్ర్టానిక్ వేయింగ్ యంత్రం తప్పనిసరిగా ఉండాలని, రైతులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా తాగునీరు, నీడ, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొన్న వెంటనే రైతులకు రశీదులు అందించాలని, ట్యాబ్‌లలో ఎంట్రీ చేయాలని సూచించారు.
Updated Date - Oct 05 , 2024 | 10:19 PM