ఘనంగా బడగ పండుగ
ABN, Publish Date - Sep 03 , 2024 | 10:35 PM
పొలాల అమావాస్య రోజున ఉపవాస దీక్షలు చేసి తర్వాత రోజు బడగ పండగను నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. బడగ పండగను పురస్కరించుకుని ఇండ్లలో పిండి వంటలు చేసుకుని బంక మట్టితో ఎడ్లను తయారు చేసి పూజ లు చేసి నైవేద్యాలు సమర్పించి దీక్షలను పూర్తి చేశా రు. అనంతరం మట్టి ఎడ్లను గంపలలో డప్పుచప్పు ళ్లతో వెళ్లి స్ధానిక చెరువులో నిమజ్జనం చేశారు.
బెల్లంపల్లి(తాండూర్), సెప్టెంబరు 3: తాండూర్ మండంలోని అచ్చలాపూర్(కొమ్ముగూడెం)లో మంగళ వారం నేతకాని కులస్తులు బడగ పండగను ఘనంగా నిర్వహించారు. పొలాల అమావాస్య రోజున ఉపవాస దీక్షలు చేసి తర్వాత రోజు బడగ పండగను నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. బడగ పండగను పురస్కరించుకుని ఇండ్లలో పిండి వంటలు చేసుకుని బంక మట్టితో ఎడ్లను తయారు చేసి పూజ లు చేసి నైవేద్యాలు సమర్పించి దీక్షలను పూర్తి చేశా రు. అనంతరం మట్టి ఎడ్లను గంపలలో డప్పుచప్పు ళ్లతో వెళ్లి స్ధానిక చెరువులో నిమజ్జనం చేశారు.
నెన్నెల: పొలాల పండుగను నేతకాని మహర్ కులస్తులు ఐదు రోజులు ఘనంగా జరుపుకుంటారు. మంగళవారం బసవన్నల ప్రతిమలను ఊరేగించి నిమజ్జనం చేశారు. అమావాస్య రోజున గ్రామ పొలి మేరల నుంచి తెచ్చిన మట్టితో బసవన్నల ప్రతిమ లు చేసి పూజించి మరుసటి రోజు నిమజ్జనం చేస్తారు. మిగతా మట్టితో గురుగులు చేసి వాటిలో పెరుగు తోడేసి మహిళలు మరో రెండు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గుండ్లసోమారం మాజీ ఎంపీటీసీ దాగం రమేష్, మెట్‌పల్లి మాజీ సర్పంచ్ శివప్రసాద్, బోర్లకుంట శంకర్, జాడి చంద్రయ్య, కుమార్, రాంచందర్, జాడి స్వామి పాల్గొన్నారు.
కాసిపేట: మండలంలో బడగ పండగను రైతులు, ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. పిండి వంటల ను గ్రామ శివారులోకి తీసుకువెళ్లి గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు బాగుండాలని, ప్రజలకు అంటు రోగా లు రావద్దని పూజలు చేశారు.
దండేపల్లి : ఆదివాసి గిరిజన గ్రామాల్లో జాగేయ్ మాతరి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మ్యాదరి పేటలో పర్ధన్‌గూడ గిరిజనులు పొలాల అమావాస్య మరుసటి రోజు వెదురు కర్రలు పట్టుకుని ఇంటిపై కప్పులను కొడుతూ జాగేయ్ మాతరి అంటు గ్రామ శివారుకు వెళ్లారు. అక్కడ పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల నుంచి విముక్తి పొందాలని ఆదివాసీల ఆచారం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు.
Updated Date - Sep 03 , 2024 | 10:35 PM