ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రూప్‌ 2, 3 పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

ABN, Publish Date - Oct 18 , 2024 | 10:29 PM

గ్రూప్‌ 2, 3 పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని టీజీపీఎస్‌సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రూప్‌ 2 పరీక్షలు డిసెంబరు 15, 16 తేదీల్లో, గ్రూప్‌ 3 నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహిస్తారన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌ 2, 3 పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని టీజీపీఎస్‌సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రూప్‌ 2 పరీక్షలు డిసెంబరు 15, 16 తేదీల్లో, గ్రూప్‌ 3 నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహిస్తారన్నారు. అధికారులు పరీక్ష కేంద్రాలు, స్ర్టాంగ్‌ రూములను గుర్తించి పూర్తి వివరాలతో నివేదికలు అందించాలన్నారు.

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ గ్రూప్‌ 2, 3 పరీక్షలకు జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 15 వేల మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, ర్యాంపులు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, పోలీసు నోడల్‌ అధికారి సుందర్‌రావు, ఆర్‌సీ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 10:29 PM