గ్రూప్ 3 పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలి
ABN, Publish Date - Nov 12 , 2024 | 10:18 PM
జిల్లాలో ఈ నెల 17,18 తేదీల్లో జరగనున్న గ్రూప్ 3 పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, ఏసీపీ ప్రకాష్, డీఈవో యాదయ్యతో కలిసి అధి కారులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 17,18 తేదీల్లో జరగనున్న గ్రూప్ 3 పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, ఏసీపీ ప్రకాష్, డీఈవో యాదయ్యతో కలిసి అధి కారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 3 పరీక్షకు జిల్లాలో 48 కేంద్రాలను ఏర్పాటు చేసి అధికారులు, సిబ్బం దిని నియమించామన్నారు. 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30వరకు, 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుం దన్నారు. పరీక్ష కేంద్రంలోకి ముఖ్య పర్యవేకులకు మాత్రమే అను మతిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయా లని, హాజరు పట్టికలు, ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లను పర్యవేక్షిం చాలన్నారు.
అత్యవసర వైద్య సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులకు గ్రౌండ్‌ఫ్లోర్ కేటాయించాలన్నారు. డీసీపీ మాట్లాడుతూ పరీక్ష నిర్వహణలో భాగంగా స్ర్టాంగ్ రూమ్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నా పత్రాలు ఓఎంఆర్ షీట్లు సామగ్రి తరలింపు ప్రక్రియ పోలీసు బందోబస్తు మధ్య జరుగుతుందన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 10:18 PM