ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం

ABN, Publish Date - Sep 22 , 2024 | 10:35 PM

నస్పూర్‌ మున్సిపాలిటీలో అభివృద్ధి పను లకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుకగా చేపట్టిన చీరలను ఆదివారం వారసంత ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు.

నస్పూర్‌, సెప్టెంబరు 22: నస్పూర్‌ మున్సిపాలిటీలో అభివృద్ధి పను లకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుకగా చేపట్టిన చీరలను ఆదివారం వారసంత ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. మున్సిపాలిటీలోని 1, 2, 14, 15, 18, 21, 22, 24, 25 వార్డులకు చెందిన మహిళలకు చీరలను అందించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజా సేవా కార్యక్రమాల్లో భాగంగా ట్రస్టు నుంచి బతుకమ్మ కానుకగా చీరలను మహిళలకు అందిస్తున్నా మన్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుకు 66వేల మెజార్టీ వస్తే అందులో 21వేల ఓట్లు నస్పూర్‌వేనని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించి పనులు చేయిస్తామన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ సుర్మిళ్ళ వేణు, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ నూకల రమేష్‌, కౌన్సిలర్లు కోడూరి లహరి, బండి పద్మ, సఽంధ్యారాణి, తోట శ్రీనివాస్‌, మడిగ మల్లయ్య, మహిళ కాంగ్రెస్‌ నాయకురాలు యశోధ, నాయకులు సంపత్‌ రెడ్డి, ధర్ని మధుకర్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 10:35 PM