mancherial పురుగుల అన్నం.. నీళ్ల పప్పు...
ABN, Publish Date - Sep 13 , 2024 | 10:29 PM
విద్యార్థులకు పురుగుల అన్నం... నీళ్ల పప్పు వడ్డించడంపై బెల్లంపల్లి జూని యర్ సివిల్ జడ్జి ముఖేష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీ బీవీ పాఠశాలతోపాటు ఆదర్శ మోడల్ కళాశాల హాస్ట ల్‌ను పరిశీలించారు. మోడల్ కళాశాలలో పురుగుల అన్నంతోపాటు నీళ్ల పప్పు వడ్డించడాన్ని చూసి ఆగ్ర హం వ్యక్తం చేశారు.
కాసిపేట, సెప్టెంబరు 13: విద్యార్థులకు పురుగుల అన్నం... నీళ్ల పప్పు వడ్డించడంపై బెల్లంపల్లి జూని యర్ సివిల్ జడ్జి ముఖేష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీ బీవీ పాఠశాలతోపాటు ఆదర్శ మోడల్ కళాశాల హాస్ట ల్‌ను పరిశీలించారు. మోడల్ కళాశాలలో పురుగుల అన్నంతోపాటు నీళ్ల పప్పు వడ్డించడాన్ని చూసి ఆగ్ర హం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారా అని ప్రశ్నించారు. కొంత కాలంగా పురు గుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బెడ్ షీట్లు లేవని, పెరుగు వడ్డించడం లేదని, పల్లి పట్టీని చిన్న ముక్కలుగా చేసి ఇస్తున్నా రని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకా రం వడ్డించకపోతే శాఖపరమైన చర్యలు ఉంటా యన్నారు. విద్యార్థుల సామర్థ్యం పరీక్షించి అసహనం వ్యక్తం చేశారు. నివేదిక రూపొందించి ఉన్నతాధికారు లకు అందజేస్తామని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా మళ్లీ వస్తానని, మెనూ, చదువులో మార్పు రాకపోతే చర్యలు ఉంటాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షు డు మనోహర్, సీనియర్ న్యాయవాదులు ఉన్నారు.
చట్టాలపై అవగాహన
కలిగి ఉండాలి
బెల్లంపల్లి: చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండా లని జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ అన్నారు. శుక్రవారం ఆటో డ్రైవర్లకు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్జి దృష్టికి ఆటో యూనియన్ నాయకులు పలు సమస్యలను తీసుకెళ్లారు. పట్టణంలో రోడ్డుకు ఇరు వైపులా వీధి వ్యాపారులు వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తు తుందని పేర్కొన్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఆటోలకు ఫైనాన్స్ ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిప్ప మనోహర్‌తో పాటు న్యాయ వాదులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Updated Date - Sep 13 , 2024 | 10:29 PM