అక్రమార్కులను వదిలేది లేదు
ABN, Publish Date - Sep 23 , 2024 | 10:37 PM
అక్రమాలకు పాల్ప డిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయ న్నారు.
మంచిర్యాల అర్బన్, సెప్టెంబరు 23 : అక్రమాలకు పాల్ప డిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయ న్నారు. నస్పూర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో టీబీజీకెఎస్ నాయకుడు ఢీకొండ అన్నయ్య భవనం అక్రమ నిర్మాణం అయినందునే అధికారులు కూల్చివేశారన్నారు. ఆ భవనం ప్రభుత్వ భూమిలో ఉందని అప్పటి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారన్నారు. ఆ భవనం తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసిం చరని అన్నారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలకు దివాకర్‌రావు కొమ్ముకాశారని ఆయన ఆరోపించారు.
మున్సిపాలిటీలో ఉద్యో గాలు పెట్టిస్తానని కౌన్సిలర్ హరికృష్ణ డబ్బులు తీసుకొని మోసగించాడని, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నార న్నారు. బేర సత్యనారాయణపై అనేక ఫిర్యాదులుండగా బాధి తుల పక్షాన నిలవకపోగా దివా కర్రావు రోడ్డుపై ఆందోళన చేయడం శోచనీయమన్నారు. లక్షెట్టిపేటలో ముత్తె సత్తయ్య, దండేపల్లిలో హరినాయక్ అనే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యం కోసం కొంత కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదన్నారు. గంజాయి అమ్మ కం, సేవించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. గంజాయి రాకెట్ వెనుక ఎవరు ఉన్నారో బయ టపెడుతామని, ఎవరు పట్టుబడినా చట్టపరమైన చర్యలుం టాయన్నారు.
రాత్రి 10 గంటలకే దుకాణాలు మూసివేసేలా చర్యలు చేపడుతామన్నారు. రాత్రివేళల్లో యువకులు బయట తిరగవ ద్దని సూచించారు. ఐబీ ప్రాంతంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం
నుంచి అనుమతి లభిం చిందని, త్వరలోనే నిర్మాణ పను లను చేపడుతామ న్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూ ముల నరేష్, రామగిరి భానేష్, కొండ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన హౌసింగ్ సొసైటీ సభ్యులు
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు జన్మదినం సంద ర్భంగా ఆయన నివాసంలో హౌసింగ్ సోసైటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అధ్య క్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు సైన్ల మొండయ్య, సభ్యులు శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే ఉన్నారు.
Updated Date - Sep 23 , 2024 | 10:37 PM