ఆరోగ్య కార్యక్రమాల అమలు లక్ష్యాలను పూర్తి చేయాలి
ABN, Publish Date - Dec 13 , 2024 | 10:34 PM
జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు లక్ష్యాలను పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని, వాటి వివరాలను రెండు రోజుల్లో తెలియజేయాలని సూచించారు.
గర్మిళ్ల, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు లక్ష్యాలను పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని, వాటి వివరాలను రెండు రోజుల్లో తెలియజేయాలని సూచించారు.
శిశు సంరక్షణ టీకాలను వంద శాతం చేయాలని, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఎక్స్‌పైరీ తేదీకి దగ్గరున్న మందులను తీసివేయాలని, ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించారు. వైద్యులు రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. డాక్టర్ సుధాకర్‌నాయక్, ఉప వైద్యాధికారి ప్రశాంతి, డీపీవో నాందేవ్, మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, డాక్టర్‌లు మానస, సుచరిత, రమేష్, కిరణ్, లక్ష్మణ్, అవినాష్, సంపత్‌రెడ్డి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 13 , 2024 | 10:34 PM