ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అండాళమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాలు

ABN, Publish Date - Nov 03 , 2024 | 10:44 PM

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల కబ్జా పరిపాటిగా మారింది. స్థలంలో మొదట తాత్కాలిక గుడిసెలు వేసి అదును చూసి పక్కా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పట్టణంలోని అండా ళమ్మ కాలనీలో ప్రస్తుతం ఇదే తంతు కొనసాగుతోంది. అండాళమ్మ కాలనీ జిల్లా కేంద్రానికి శివారులో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న చోటా, మోటా నాయకులు గుట్టుచప్పుడు కాకుండా స్థలాలను చేజిక్కించుకుంటున్నారు.

మంచిర్యాల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల కబ్జా పరిపాటిగా మారింది. స్థలంలో మొదట తాత్కాలిక గుడిసెలు వేసి అదును చూసి పక్కా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పట్టణంలోని అండా ళమ్మ కాలనీలో ప్రస్తుతం ఇదే తంతు కొనసాగుతోంది. అండాళమ్మ కాలనీ జిల్లా కేంద్రానికి శివారులో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న చోటా, మోటా నాయకులు గుట్టుచప్పుడు కాకుండా స్థలాలను చేజిక్కించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఐదారు చోట్ల స్థలాలను ఆధీనంలో ఉంచుకోవడం గమనార్హం.

పేదలకు నివాస స్థలాల కోసం...

మాజీ ఎమ్మెల్యే, దివంగత గోనె హన్మంతరావు సొంత స్థలాన్ని పేద ప్రజల నివాస స్థలాల కోసం 40 సంవత్సరాల క్రితం రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిం చారు. అప్పటి నుంచి ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. ఇంటి స్థలాలు లేని, పేద ప్రజలకు అధికారులు పట్టాలు అందజేశారు. వారంతా శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో హన్మంతరావు అతని తల్లి అండాళమ్మ పేరును కాలనీకి పెట్టారు. అనంతరం విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు, సీసీ రోడ్లు వేయడంతో కాలనీ రూపురేఖలు మారాయి. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కింద కాలనీ ఉండగా, ప్రస్తుతం అక్కడ శాశ్వత నిర్మాణాలతోపాటు బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి.

విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు...

అండాళమ్మ కాలనీ అభివృద్ధి చెందడంతో కబ్జాదారుల కళ్లు అక్కడి భూములపై పడ్డాయి. కాలనీలో ఉన్నవి ప్రభుత్వ స్థలాలే కావడంతో కబ్జాలు ప్రారంభమ య్యాయి. ప్రస్తుతం కాలనీలో దర్శనమిస్తున్న నిర్మాణాల్లో చాలా వాటికి ఎలాంటి పట్టాలు, ఇంటి నిర్మాణ అనుమ తులు లేవు. అయినా ప్రతీ ఇంట్లో విద్యుత్‌ సౌకర్యం, మున్సిపల్‌ నల్లాలు ఉన్నాయి. అధికారుల అండతో అక్రమంగా ఇంటి నెంబర్లు, మీటరు, నల్లా కనెక్షన్లు పొందినట్లు తెలుస్తోంది.

నాయకుల ముసుగులో అక్రమ విక్రయాలు...

అండాళమ్మ కాలనీలో చోటామోటా నాయకులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. తమ ఆధీ నంలో ఉన్న ఒక్కో ప్లాట్‌కు రూ. లక్ష చొప్పున వసూలు చేస్తూ ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అలా అక్రమ మార్గంలో ప్లాట్లు పొందుతున్న స్థానికులు కొందరు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం అదును చూసి తమ ఇళ్లను ఆనుకొని ఉన్న మిగతా ఖాళీ స్థలాలను కబ్జా చేసుకుంటున్నారు. అలా కబ్జా చేసిన స్థలంలో మేకల పెంపకం పేరుతో గుడిసెలు ఏర్పాటు చేస్తూ చేజిక్కించుకుంటున్నారు. కాలనీలో సుమారు వంద నుంచి రెండు వందల ప్లాట్ల వరకు అన్యాక్రాంతం అయినట్లు ప్రచారం జరుగుతోంది. కాలనీలో చదరపు గజం బహిరంగ మార్కెట్‌ ప్రకారం విలువ కనీసం రూ. 10వేలు పలుకుతోంది.

ఇప్పటికైనా అధికారులు స్పందించి అండాళమ్మ కాలనీలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Nov 03 , 2024 | 10:44 PM