ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెరిగిన మద్యం విక్రయాలు

ABN, Publish Date - Oct 13 , 2024 | 10:09 PM

దసరా పండుగ వ్యాపారం జిల్లాలో జోరుగా సాగింది. గతేడాదితో పోల్చితే మద్యం, ఇతర వ్యాపారాల్లో విక్రయాలు పెరిగాయి. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెట్టిపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో ఈ నెల 10, 11 తేదీల్లో రూ.8.87 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరి గాయి.

మంచిర్యాల, అక్టోబరు 13 (ఆంద్రజ్యోతి): దసరా పండుగ వ్యాపారం జిల్లాలో జోరుగా సాగింది. గతేడాదితో పోల్చితే మద్యం, ఇతర వ్యాపారాల్లో విక్రయాలు పెరిగాయి. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెట్టిపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో ఈ నెల 10, 11 తేదీల్లో రూ.8.87 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరి గాయి. నాలుగు సర్కిళ్ల పరిధిలో మొత్తం 8398 కేసుల లిక్కర్‌ అమ్మకాలు నమోదు కాగా, 14096 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి.

పెరిగిన మద్యం అమ్మకాలు

దసరా పండుగ పురస్కరించుకొని ఏ వ్యాపారం ఎలా ఉన్నా మద్యం అమ్మకాలు మాత్రం విపరీతంగా జరుగుతాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు పెరిగాయి. 2023లో దసరా సమయంలో రూ.7.60 కోట్లు ఆదాయం సమకూరగా ఈ యేడు రూ.1.21 కోట్ల అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి. ఈ సంవత్సరం దసరా శనివారం రావడంతో మద్యం అమ్మకాలు కొంతమేర తగ్గుతాయనే ప్రచారం జరిగింది. అయితే శనివారం మద్యం, మాంసం ముట్టని వారు శుక్ర, ఆదివారాల్లో దసరాను జరుపుకున్నారు. ఇందుకు ముందుగానే మద్యం కొనుగోళ్లు చేయడంతో అమ్మకాలు పెరిగాయి.

కళకళలాడిన వస్త్ర దుకాణాలు

దసరా పండుగను పురస్కరించుకొని వస్త్ర, రెడిమేడ్‌ దుకాణాలు ఈ సంవత్సరం కళకళలాడాయి. జిల్లా వ్యాప్తంగా రూ.50 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అంచనా. గతేడాదితో పోలిస్తే వస్త్ర దుకాణాల్లో విక్రయాలు పెరిగాయి. దసరా పండుగ నేపథ్యంలో ౉ షాపింగ్‌ మాల్‌లు, షోరూంలలో ప్రజల ఆసక్తికి అనుగుణంగా పెద్ద మొత్తంలో స్టాకు ఉంచగా, ఊహించిన దానికంటే రెట్టింపు అమ్మకాలు నమోదైనట్లు తెలుస్తోంది. మరోవైపు మాంసం అమ్మకాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.2 కోట్ల విలువగల చికెన్‌, మటన్‌ విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.

లాభాల బోనస్‌ జమ చేయడంతో

సింగరేణి కార్మికులకు యాజమాన్యం లాభాల బోనస్‌ అందజేయడంతో ఈ సంవత్సరం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. లాభాల బోనస్‌ 33 శాతం చెల్లించనున్నట్లు గత నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో కార్మికులు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రకటించిన విధంగా లాభాల వాటా ఒక్కో కార్మికునికి సగటున రూ. 3 లక్షల మేర నగదు చేతికి అందడంతో దసరా కొనుగోళ్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు విడుదల చేస్తోంది. దీంతో దసరా వేళ నగదు చేతికి అందడంతో ఉద్యోగులు సైతం పండుగను ఘనంగా జరుపుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది ప్రజలను దసరా పండుగను ఘనంగా జరుపుకోగా, వ్యాపారంలోనూ వృద్ధి కనిపించడంతో సర్వత్రా ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు.

Updated Date - Oct 13 , 2024 | 10:09 PM