ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సహకార సంఘం అవినీతిపై విచారణ

ABN, Publish Date - Oct 25 , 2024 | 10:48 PM

జైపూర్‌ ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతిపై శుక్రవారం కార్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్టర్‌ పీఏసీఎస్‌ చెన్నూరు ఫీల్డ్‌ అధికారి రవికిశోర్‌ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.

జైపూర్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జైపూర్‌ ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అవినీతిపై శుక్రవారం కార్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్టర్‌ పీఏసీఎస్‌ చెన్నూరు ఫీల్డ్‌ అధికారి రవికిశోర్‌ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. వైస్‌చైర్మన్‌ ఎస్‌. శేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని, జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి జిల్లా స్థాయి అధికారులకు విన్నవిస్తామని పేర్కొన్నారు.

పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ చైర్మన్‌ గుండు తిరుపతి సొసైటీలో ఎలాంటి తీర్మానాలు లేకుండా ఇష్టారాజ్యంగా నిధులు డ్రా చేశారని జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. సంఘంలో రూ.4.50 లక్షల నుంచి వివిధ ఖర్చుల కోసం తీసుకుని ఖర్చు పెట్టలేదని అధికారులకు ఫిర్యాదు చేశానని, ఆఫీసు సామగ్రి పేరుతో అవినీతికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.

Updated Date - Oct 25 , 2024 | 10:48 PM