ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: తెలంగాణలోని ఓ కుగ్రామం.. అస్సలు నమ్మశక్యం కాని దాని కథేంటో తెలిస్తే..

ABN, Publish Date - Apr 12 , 2024 | 09:47 AM

ముఖ్యంగా సెల్‌ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత పక్క ఇంటి వారి విషయం పక్కనబెడితే మన ఇంట్లోని వారినే పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో పది మంది ఉన్నా కూడా తలొక ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు తప్ప ఒకరితో ఒకరు సరదాగా గడుపుతున్నదే లేదు.

ఆదిలాబాద్: ముఖ్యంగా సెల్‌ఫోన్ (cellphone) వినియోగం పెరిగిన తర్వాత పక్క ఇంటి వారి విషయం పక్కనబెడితే మన ఇంట్లోని వారినే పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో పది మంది ఉన్నా కూడా తలొక ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు తప్ప ఒకరితో ఒకరు సరదాగా గడుపుతున్నదే లేదు. ఇలాంటి తరుణంలో ఊరంతా ఒకచోట చేరడమనేది కూడా ఆసక్తికరంగానే మారుతోంది. అలాంటిది ఆ ఊరి వాళ్లు మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు రోజుల పాటు కలిసి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఊరంతా కలిసి ఒకచోట చేరి ఐదు రోజుల పాటు సహపంక్తి భోజనాలు చేస్తూ దైవారాధనలోనే ఉండిపోతారు. ఈ గ్రామం ఎక్కడో లేదు. మన తెలంగాణలోనే ఉంది. ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా బేల మండలంలోని కాప్సి(బి) అనే గ్రామంలో ప్రతి ఏడాది జరిగే తంతు ఇది.

TG Politics: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మునిగిపోవడం ఖాయం: రఘునందన్ రావు


గ్రామం రూపు రేఖలే మారిపోయాయట..

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా నేరి గ్రామంలో నానాజీ మహరాజ్‌ విఠల్‌ రుకుంబాయి అనే వ్యక్తి ఉండేవాడు. అతని చిన్నప్పుడే తల్లిదండ్రులు కాలం చేశారు. నిత్యం దైవచింతనలో గడుపుతూ పాలేరు పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలోనే మహరాజ్ గ్రామగ్రామాలు తిరుగుతూ.. వార్దా జిల్లా పెద్ద కాప్సి గ్రామానికి చేరుకున్నాడు. ఆయన అడుగు పెట్టిన నాటి నుంచి ఆ గ్రామం రూపు రేఖలే మారిపోయాయట. అక్కడ తన గురువు విఠల్‌ రుకుంబాయి ఆలయాన్ని నిర్మించాడు. అక్కడి నుంచి మహరాజ్ తాత్విక బోధనలు చేయడం ఆరంభించాడు. ఆయన శిష్యులుగా చేరిన వారు మాంసాహారంతో పాటు మద్యం వంటి వ్యసనాలను మానేశారు.

Telangana: ఉద్యోగాల్లో వసూళ్ల ‘సోర్సింగ్‌’!


భగవత్ స్వరూపంగా..

అయితే లక్ష్మణ్ పాటిల్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఎక్కడికి వెళ్లినా వ్యాధి మాత్రం నయం కాకపోవడంతో ఎవరో సలహా మేరకు మహరాజ్ గురించి తెలుసుకుని మహారాష్ట్రలోని పెద్ద కాప్సికి వెళ్లాడు. అంతే ఐదే ఐదు రోజుల్లో లక్ష్మణ్ పాటిల్ కోలుకున్నాడు. ఆ తరువాతి నుంచి మహరాజ్‌ను సైతం భగవత్ స్వరూపంగా అక్కడి వారు చూడటం మొదలు పెట్టారు. గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంతో పాటు ప్రత్యేకంగా మహరాజ్‌ దేవతామూర్తులను ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తున్నారు. అక్కడ మహరాజ్ గుడిపడవా వేడుకలను సైతం ప్రారంభించారు. ఇక పదేళ్లుగా ఈ గ్రామంలో ఉగాది వచ్చిందంటే చాలు.. ఐదు రోజుల పాటు ఊరు ఊరంతా ఒకచోట చేరుతోంది. ఇలా రోజుల్లో అలా గడపడమంటే అస్సలు నమ్మశక్యంగా లేదు కదా.. అది కూడా ఒకరోజు కాదు.. ఏకంగా ఐదు రోజులు..


ఏది కోరుకుంటే అది జరుగుతుందట..

అయితే మహరాజ్ 174 ఏళ్ల కిందట ఉగాది రోజున ఆ గ్రామంలో అడుగు పెట్టారట. అందుకే ఉగాది పర్వదినం సందర్భంగా ఐదు రోజుల పాటు గ్రామస్థులంతా ఒక చోట చేరి వేడుకను జరుపుకుంటూ ఉంటారు. ఈ ఐదు రోజుల పాటు ఒక్కరి ఇంట్లో కూడా పొయ్యి వెలగదట. ఉదయం, సాయంత్రం సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తారు. అక్కడే ఉంటూ అక్కడే తినేసి భక్తిపారవశ్యంలో గ్రామస్థులంతా మునిగితేలుతుంటారు. ఇక ఈ ఏడాది ఉగాది సందర్భంగా 9న ప్రారంభమైన వేడుకలు 14తో ముగియనున్నాయి. ఇలా పదేళ్లుగా జరుగుతోంది. ఇక్కడి ఆలయంలో ఏది కోరుకుంటే అది జరుగుతుందన్న నమ్మకం ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలు వారు సైతం పెద్ద సంఖ్యలో ఇక్కడి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు.

Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కవిత.. ఇక సీబీఐ వంతు.. నెక్ట్స్ ఏం జరిగేనో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 12 , 2024 | 09:47 AM

Advertising
Advertising