కాకా వెంకటస్వామి పేరు పెట్టడం సిగ్గు చేటు
ABN, Publish Date - Oct 28 , 2024 | 10:43 PM
పట్టణంలోని కూరగాయల మార్కెట్ భవనానికి గడ్డం వెంకటస్వామి(కాకా) పేరు పెట్టడం సిగ్గు చేటని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయకార్యదర్శి పసులేటి వెంకటేష్‌లు పేర్కొన్నారు. మార్కెట్ భవనానికి వెంకటస్వామి పేరును రద్దు చేయాలని సోమవారం మార్కెట్ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు.
బెల్లంపల్లి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కూరగాయల మార్కెట్ భవనానికి గడ్డం వెంకటస్వామి(కాకా) పేరు పెట్టడం సిగ్గు చేటని ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయకార్యదర్శి పసులేటి వెంకటేష్‌లు పేర్కొన్నారు. మార్కెట్ భవనానికి వెంకటస్వామి పేరును రద్దు చేయాలని సోమవారం మార్కెట్ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం కౌన్సిల్ సమావేశంలో మార్కెట్‌కు గడ్డం వెంకటస్వామి పేరు పెట్టాలని తీర్మానం చేయడం సరైంది కాదన్నారు. అంబేద్కర్ పేరు పెట్టాలని సభ్యులు తీర్మానం చేయాల్సి ఉండగా కాంగ్రెస్ నాయకుని పేరు పెట్టడం అనాలోచిత విధానానికి నిదర్శనమన్నారు.
అంబేద్కర్ పేరు పెడితే పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, నాయకులు, వ్యాపారులు హర్షిస్తారని తెలిపారు. కాకా వెంకటస్వామి బెల్లంపల్లికి చేసిందేమి లేదని, స్ధానికుడు కూడా కాదని, అధికారం ఉంది కదా అని అగ్ర నాయకుల మెప్పు పొందడానికి కౌన్సిల్‌లో తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే మార్కెట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు ఆరేపల్లి రమేష్, సతీష్, సాయి, శేఖర్, అరుణ్, రాకేష్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 28 , 2024 | 10:43 PM