గిరిజన సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలే
ABN, Publish Date - Oct 26 , 2024 | 11:28 PM
గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలేనని రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. గుడిరేవులోని పద్మల్‌పూరీ కాకో ఆలయాన్ని శనివారం సందర్శించారు. గిరిజన సంప్రదాబద్దంగా గుస్సాడీతో స్వాగతం పలికారు.
దండేపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలేనని రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. గుడిరేవులోని పద్మల్‌పూరీ కాకో ఆలయాన్ని శనివారం సందర్శించారు. గిరిజన సంప్రదాబద్దంగా గుస్సాడీతో స్వాగతం పలికారు. ఆయన గుస్సాడీ వేషధారణ ధరించి గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దర్శనం అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు, గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 28న గుస్సాడి దండారీ దర్బార్ నిర్వహణపై గిరిజనులతో చర్చించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, సభ్యులు, ఉమ్మడి జిల్లాల ఆదివాసి గిరిజన పటేల్, గిరిజనులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కాకో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు గుస్సాడిలతో గిరిజన సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి రూ.32లక్షల నిధులను మంజూరు చేశానన్నారు. కాసనగొట్ల లింగన్న, చుంచు శ్రీనివాస్, అనిల్‌కుమార్, గొట్ల భూమన్నయాదవ్ పాల్గొన్నారు.
పద్మల్‌పూరీ కాకో ఆలయాన్ని సీఐ అల్లం నరేందర్, ఎస్సై ఉదయ్‌కిరణ్‌లు సందర్శించారు. గుస్సాడీ వేషధారణతో ఆలయం వరకు ఘన స్వాగతం పలికారు. కాకో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. దండారీ గుస్సాడి దర్బార్ ఏర్పాటుపై ఆరా తీశారు.
Updated Date - Oct 26 , 2024 | 11:28 PM