ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముఖ్యమంత్రిని కలిసిన కేజీబీవీ విద్యార్థులు

ABN, Publish Date - Nov 04 , 2024 | 10:43 PM

మంచిర్యాల జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులు సోమవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. పాఠశా లకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

మంచిర్యాల, నవంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులు సోమవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. పాఠశా లకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయగా తమ ప్రభుత్వం విద్యారంగ పురోగతికి కట్టుబడి ఉందన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించామని, ఉపాధ్యాయుల బదిలీలు వివాదం లేకుండా జరిపామని, పదోన్నతులు కల్పించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని, త్వరలో సోర్ట్స్‌ యూని వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌ ప్రమాదకరమని, వాటి బారిన పడవద్దని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ ఉండాలని, చదువుకున్న వారు ప్రయోజకులు అవుతారని సీఎం అన్నారు. సామాజిక స్పృహతో సమాజానికి సేవ చేసే వారు హీరోలు అవుతారని, ఉన్నత చదవులు చదువుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగసామ్యం కావాలని సీఎం సూచించారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్‌, కాస్మోటిక్స్‌ చార్జీలు పెంచినందుకు ముఖ్యమంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 10:43 PM