ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి

ABN, Publish Date - Aug 27 , 2024 | 10:32 PM

ఎలాంటి షరతులు లేకుం డా రైతులకు రుణమాఫీ చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్‌ పేర్కొన్నారు. చెన్నూ రు పాత బస్టాండ్‌ వద్ద మంగళవారం ధర్నా చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న రైతు రుణమాఫీ పథకం చాలా మం దికి అందలేదన్నారు.

బీజేపీ ధర్నా

చెన్నూరు, ఆగస్టు 27: ఎలాంటి షరతులు లేకుం డా రైతులకు రుణమాఫీ చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్‌ పేర్కొన్నారు. చెన్నూ రు పాత బస్టాండ్‌ వద్ద మంగళవారం ధర్నా చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న రైతు రుణమాఫీ పథకం చాలా మం దికి అందలేదన్నారు. ఎన్నికల ముందు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఆంక్షలు పెడుతూ రైతులకు రుణమాఫీ చేయడం లేదన్నారు. ఇప్పటివరకు కనీసం 20 శా తం రైతులకు కూడా రూ.2 లక్షల లోపు రుణమాఫీ అందలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాల యంలో వినతిపత్రం అందించారు. బీజేపీ పట్టణా ధ్యక్షుడు జాడి తిరుపతి, పెద్దపల్లి పార్లమెంట్‌ కన్వీనర్‌ నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, ప్రధాన కార్య దర్శులు వెంకటనర్సయ్య, శ్రీపాల్‌, శంకర్‌, రామయ్య, శంకర్‌, శ్రీనివాస్‌, బాపు, సంజయ్‌, దీక్షితులు, కోటపల్లి, భీమారం, జైపూర్‌, మందమర్రి మండలాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: ఎలాంటి షరతులు లేకుం డా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశం, బీకేఎం యూ జిల్లా అధ్యక్షుడు దేవవరంలు పేర్కొన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందిం చారు. వారు మాట్లాడుతూ రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని, దీంతో ఆందోళన చెందు తున్నారు. రెండు లక్షలకు పైగా ఉన్న అప్పును చెల్లించాలని అధికారులు రైతులను ఒత్తిడి చేయడం సరైంది కాదన్నారు. వెంటనే రైతులందరికి ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కోరారు. రవి, రమణరెడ్డి, రాజన్న, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 10:32 PM

Advertising
Advertising
<