ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెకుముఖి సైన్స్‌ సంబురాలను విజయవంతం చేయండి

ABN, Publish Date - Oct 25 , 2024 | 10:46 PM

జనవిజ్ఞాన వేదిక చెకుముఖి సైన్స్‌ సంబురాలు-2024ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.యాదయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సైన్స్‌ సంబరాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

మంచిర్యాల అర్బన్‌, అక్టోబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): జనవిజ్ఞాన వేదిక చెకుముఖి సైన్స్‌ సంబురాలు-2024ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.యాదయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సైన్స్‌ సంబరాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. నవంబర్‌ 7న పాఠశాల స్థాయి, 21న మండల, 28న జిల్లా, డిసెంబర్‌ 14, 15, 16వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు.

తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం ప్రభుత్వ పాఠశాలలు రూ.5, ప్రైవేట్‌ పాఠశాలలు రూ.10 ప్రవేశరుసుము చెల్లించి పాల్గొనాలని తెలిపారు. 8, 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని, పూర్తి వివరాలకు జన విజ్ఞానవేదిక బాధ్యులు ఎడ్ల కిషన్‌ 9705224515 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, జేవీవీ గౌరవ అధ్యక్షుడు దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 10:46 PM