వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Sep 03 , 2024 | 10:37 PM
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటు లో ఉంటూ అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ సూచించారు. మంగళవారం తాళ్లగురిజాల పీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, రికార్డులు, రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వైద్యు లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
బెల్లంపల్లి, సెప్టెంబరు 3: వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటు లో ఉంటూ అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ సూచించారు. మంగళవారం తాళ్లగురిజాల పీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, రికార్డులు, రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వైద్యు లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, ఐసీడీఎస్ శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, కలుషిత నీరు తాగితే కలిగే నష్టాల గురించి వివరిం చాలన్నారు. రాపిడ్ రెస్పాన్స్ టీంలు రెడీగా ఉం డాలని, డెంగ్యూ, మలేరియా కిట్‌లు అందుబా టులో ఉంచుకోవాలన్నారు. వైద్యం అందించ డంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. అనంతరం ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. గదుల్లో మందులు, ఇతర డబ్బాలు ఉండడంతో గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్‌కుమార్, మెడికల్ ఆఫీసర్ యువాంజలి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నెన్నెల: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సిబ్బంది మెరుగైన సేవ లు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీష్‌రాజ్ అన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్‌తో కలిసి నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తని ఖీ చేశారు. సిబ్బందితో సమావేశమై పలు సలహాలు, సూచనలి చ్చారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా మెదులుకోవా లన్నారు. సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రు ల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. పోస్టులు, సిబ్బంది, ఔట్ పేషంట్లు, మందుల స్టాక్ వివరాల గూర్చి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మణ్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులను సిబ్బంది సన్మానించారు.
భీమిని: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో హరీష్ రాజ్ తనిఖీ చేశారు. ఈ నెలలో ఎంత మంది ప్రసవానికి ఉన్నారో వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించాలని, ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల ను పెంచాలని వైద్యుడిని ఆదేశించారు. ఇన్, అవుట్ పేషంట్లు, మం దులను తనిఖీ చేశారు. అత్యవసర మందులు, కుక్క కాటు ఇంజెక్షన్లు అందుబాటులో ఉండాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్ నా యక్, వైద్యుడు కుమారస్వామి, స్టాఫ్‌నర్స్ జలపతి పాల్గొన్నారు.
Updated Date - Sep 03 , 2024 | 10:37 PM