ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వచ్ఛమైన నీరందించేందుకు చర్యలు

ABN, Publish Date - Sep 23 , 2024 | 10:35 PM

గ్రామాల్లో స్వచ్ఛ మైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకొంటున్నా మని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వెంకటేష్‌ తెలిపారు. సోమవారం ఎంపీడీవో కార్యాల యంలో బెల్లంపల్లి, తాండూర్‌ మండలాల గ్రామ మం చినీటి సహాయకులకు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు.

బెల్లంపల్లిరూరల్‌, సెప్టెంబరు 23: గ్రామాల్లో స్వచ్ఛ మైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకొంటున్నా మని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వెంకటేష్‌ తెలిపారు. సోమవారం ఎంపీడీవో కార్యాల యంలో బెల్లంపల్లి, తాండూర్‌ మండలాల గ్రామ మం చినీటి సహాయకులకు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో మంచినీటి పైపులైన్‌ల నిర్వ హణ, వాటర్‌ నీటి నాణ్యత పరీక్షలు, క్లోరినేషన్‌ ప్రక్రి యపై నాలుగు రోజులు శిక్షణ తరగతులు నిర్వహిస్తు న్నామన్నారు. కార్యదర్శితోపాటు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికా రుల పర్యవేక్షణలో పనులు చేపట్టడం జరుగుతుం దన్నారు. మొదటి దశలో 37 మంది నీటి సహాయకుల నియమించగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీవో మహేందర్‌, ఎపీవో శ్రీనివాస్‌, అధికారులు శ్రీనాధ్‌, పోశన్న పాల్గొన్నారు.

జైపూర్‌: మిషన్‌ భగీరథ ఆధ్వర్యంలో నిర్వహించే మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమాన్ని రైతు వేదికలో ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీవైడీఈ విద్యాసాగర్‌ ప్రారంభించారు. వారు మాట్లా డుతూ గ్రామాల్లో మిషన్‌ భగీరథ పైపులైన్‌లు పగిలి పోవడం, వాటర్‌ ట్యాంకులను శుభ్రం, వాటర్‌ లీకేజీ లాంటి పనులు ఎలా చేపట్టాలో శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఎంపీవో శ్రీపతి బాపురావు, పాల్గొన్నారు.

కాసిపేట: మిషన్‌ భగీరథ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తాగునీటి సహాయకులకు నీటి వినియో గంపై ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. డిప్యూటీ ఈఈ రతన్‌కుమార్‌ మంచి నీటి నాణ్యత వాటర్‌ ట్యాంకుల శుద్ధి, క్లోరినేషన్‌, ఫ్లోరై డ్‌లపై సిబ్బందికి అవగాహన కల్పించారు. మంచి నీటిని గ్రామాల్లో విడుదల చేసే విధానం, నీటి పరీక్షల గురించి వివరించారు. అధికారులు జాఫర్‌, అచ్యుత్‌, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, సీనియర్‌ సహాయ కులు లక్ష్మీనారాయణ, సూపర్‌వైజర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 10:35 PM