ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలం

ABN, Publish Date - Sep 29 , 2024 | 10:13 PM

స్ధానిక సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ గ్రామాల ప్రజలు అనారోగ్యం, జ్వరాలతో బాధపడు తున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు.

తాండూర్‌, సెప్టెంబరు 29: స్ధానిక సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ గ్రామాల ప్రజలు అనారోగ్యం, జ్వరాలతో బాధపడు తున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. మండలంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. ఐబీ సెంటర్‌లోని కూరగాయల సంత వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయా లని డిమాండ్‌ చేశారు. అనంతరం సభ్యత్వ నమోదుపై నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు దూడపాక భరత్‌కుమార్‌, సభ్యత్వ నమోదు కోకన్వీనర్‌ చిలుముల శ్రీకృష్ణదేవరా యలు, నాయకులు సుధీర్‌గౌడ్‌,చిరంజీవి, శేషగిరి, మహీధర్‌గౌడ్‌, ప్రదీప్‌, విగ్నేష్‌, శ్రీనివాస్‌, చరణ్‌, చంద్రయ్య,చందు,మహేష్‌, సతీష్‌, శ్రావణ్‌, శంకర్‌ పాల్గొన్నారు.

బీజేపీ సభ్యత్వ నమోదు

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 29: మంచిర్యాలలోని వేముల బస్తీ, గోపాల్‌వాడలో ఆదివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేప ట్టారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి ఇంటింటికి వెళ్లి ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ సభ్యత్వం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. దేశాన్ని ప్రధాని మోదీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్‌రావు, కృష్ణమూర్తి, సూరి, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 10:13 PM