ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Harish Babu: ఢిల్లీకి డబ్బులు పంపే పనిలో సీఎం రేవంత్ బీజీ: ఎమ్మెల్యే హరీశ్ బాబు

ABN, Publish Date - Jun 17 , 2024 | 07:14 PM

సుల్తానాబాద్ అత్యాచార ఘటనతోనైనా సీఎం రేవంత్‌ రెడ్డికి కనువిప్పు కలగాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు (MLA Palwai Harish Babu) అన్నారు. ఇంటి తగాలతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కుంటుపడిందని, మంత్రివర్గాన్ని కూడా విస్తరించలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నారని మండిపడ్డారు.

సిర్పూర్: సుల్తానాబాద్ అత్యాచార ఘటనతోనైనా సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)కి కనువిప్పు కలగాలని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు (MLA Palwai Harish Babu) అన్నారు. ఇంటి తగాలతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కుంటుపడిందని, మంత్రివర్గాన్ని కూడా విస్తరించలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణకు హోంమంత్రి లేకపోవడంతో వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.


ఢిల్లీకి డబ్బులు పంపించే పనిలో సీఎం బిజీగా ఉన్నారని ఆరోపించారు. చాక్లెట్ దొరికినంత ఈజీగా తెలంగాణలో గంజాయి దొరుకుతుందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు. మంత్రులు ఎవరి సంపాదనలో వాళ్లు బీజీబీజీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వరసగా బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే రివ్యూ చేయలేని స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ఒక్క నెలలోనే మియాపూర్ నడిగడ్డతండా, సుల్తానాబాద్ హత్యాచార ఘటనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ప్రశ్నించారు.

Updated Date - Jun 17 , 2024 | 07:27 PM

Advertising
Advertising