ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నెలాఖరులోగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABN, Publish Date - Sep 01 , 2024 | 10:33 PM

మంచిర్యాల నియోజకవర్గంలో నెలాఖరులోగా అభివృద్ధి కార్యక్ర మాలకు శంకుస్థాపనలు జరుగుతాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

మంచిర్యాల అర్బన్‌, సెప్టెంబర్‌ 1: మంచిర్యాల నియోజకవర్గంలో నెలాఖరులోగా అభివృద్ధి కార్యక్ర మాలకు శంకుస్థాపనలు జరుగుతాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఐబీ చౌరస్తా లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం శం కుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ జాతీయ నేతలు హాజరవుతారన్నారు. రాళ్లవాగు వరద ముంపు వాటిళ్లకుండా కరకట్టను నిర్మిస్తామని, అలాగే ఎత్తి పోతల పథకాలకు శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. ముల్కల్ల నుంచి బసంత్‌నగర్‌ గోదావరి నదిపై రూ.373 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం జరుగుతుం దని, నియోజకవర్గ కేంద్రంలో రెండో బ్రిడ్జి నిర్మాణం కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయన్నారు. ప్రతీ ఒక రైతుకు రుణమాఫీ, రైౖతుభరోసా అందిస్తామన్నారు. రూ.2లక్షల రుణమాఫీ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని, సాంకే తిక కారణాల వల్లనే కొంత జాప్యం జరుగుతుందని, అంతే తప్ప ఏ రైతుకు నష్టం జరగదని చెప్పారు. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నా రు. బీఆర్‌ఎస్‌ నేతలు భూఆక్రమణ దారులకు మద్దతు ఇవ్వడం శోచనీ యమన్నారు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మున్సిపల్‌చైర్మన్‌ ఉప్పలయ్య, పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చి అభివృద్ధి చేస్తా

లక్షెట్టిపేటరూరల్‌: ఇచ్చిన హామీలను నెరవేర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు అన్నారు. గురునానక్‌ ఫంక్ష న్‌హాలులో 194 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి, సంక్షే మానికి కృషి చేస్తుందన్నారు. పదేండ్ల పాలనలో అప్పటి పాలకులు చేసిన నిర్లక్ష్యం, అక్రమాలను రానున్న రోజుల్లో ఎండగడతామన్నారు. రాష్ట్ర గిరి జన కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుపతి, ఆర్డీవో రాములు, తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌, పట్టణాధ్యక్షుడు ఆరీఫ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కాంతయ్య, ఫ్లోర్‌ లీడర్‌ నాగభూషణం, రమేష్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2024 | 10:33 PM

Advertising
Advertising