ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి

ABN, Publish Date - Sep 24 , 2024 | 10:52 PM

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బెది రింపు రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. మంగళవారం బీజేపీ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బీజేపీ నాయకులపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుల పై కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 24: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బెది రింపు రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు. మంగళవారం బీజేపీ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బీజేపీ నాయకులపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుల పై కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. ఈ విష యంపై ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో భూ కబ్జాదారులే భూ ఆక్రమణల గురించి మాట్లాడుతుం టే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు హైద్రాబాద్‌ కాప్రాలో పేదల భూములు కబ్జా చేశారని, ఆ బాధితులు చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైద్రాబాద్‌ చెరువుల్లో బఫర్‌ జోన్‌లలో ఇండ్లు కట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవం త్‌రెడ్డి జిల్లాలో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న భూ ఆక్రమణల జాబితా తెప్పించుకుని ఆక్రమణలు చేసిన కాంగ్రెస్‌ నాయకుల ఇండ్లు కూలగొట్టాలని డిమాండ్‌ చేశారు. భూ కబ్జాలు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరగానే నీతి మంతులయ్యారా అని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయ కులపై బెదిరింపుల చర్యలు మానుకోవాలని హెచ్చ రించారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకులు బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. పురుషోత్తం, వెంకటేశ్వర్‌రావు, తిరుపతి, శ్రీనివాస్‌, లచ్చన్న, రాంచందర్‌, మల్లేష్‌, రాజు, అశ్విన్‌, సదా నందం, మధు రెన్వా, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 10:52 PM