ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యల పరిష్కారానికి కృషి

ABN, Publish Date - Sep 01 , 2024 | 10:31 PM

మందమర్రి మున్సిపాలిటీలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. ఆదివారం 1, 2వ వార్డులు, యాపల్‌ ఏరి యా, జీఎం ఆఫీస్‌ కాలనీల్లో పాదయాత్ర నిర్వహిం చారు. ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు.

మందమర్రిటౌన్‌, సెప్టెంబరు 1: మందమర్రి మున్సిపాలిటీలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. ఆదివారం 1, 2వ వార్డులు, యాపల్‌ ఏరి యా, జీఎం ఆఫీస్‌ కాలనీల్లో పాదయాత్ర నిర్వహిం చారు. ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ స్తంభాలను పరిశీలిం చారు. సరిగ్గా లేని విద్యుత్‌ స్తంభాలు, వీధిలైట్లను బాగు చేయాలని ఏఈ మల్లయ్యకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీరు, డ్రైనేజీలు, రోడ్డు సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని తెలిపారు. జ్వరాలు ప్రబలుతున్నందున ఫాగింగ్‌ యంత్రాలను కొనుగోలు చేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. జీఎం ఆఫీస్‌ కాలనీ ఏరియాలో కమ్యూనిటీ హాలు కావాలని వార్డు ప్రజలు కోరారని, హాలు నిర్మాణం చేపడతామన్నారు. మాజీ విప్‌ నల్లాల ఓదెలు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, నాయకులు సొత్కు సుదర్శన్‌, నోముల ఉపేం దర్‌గౌడ్‌, గుడ్ల రమేష్‌, వనం నర్సయ్య, ఆకారం రమేష్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మిషన్‌ భగీరథ పేరుతో కోట్లు దండుకున్నారు

మిషన్‌ భగీరథ పేరుతో గత ప్రభుత్వం కోట్ల రూపాయలు దండుకుంటుందని, మందమర్రిలో రూ.40 కోట్లతో పథకం ప్రవేశపెట్టారని, కానీ ప్రజ లకు సురక్షిత నీరు అందించలేదని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం వార్డుల్లో సర ఫరా అవుతున్న నీటిని పరిశీలించారు. మురుగు నీటిని చూపుతూ ఈ నీరు తాగితే ప్రజలు రోగాల బారిన పడతారన్నారు. త్వరలోనే రూ. 30కోట్లతో సురక్షిత తాగునీటి పథకం అందుబాటులోకి తెస్తా నని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.

పట్టణంలోని 1వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ నేత, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానం దం యాదవ్‌ను ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పరా మర్శించారు. సదానందం వైరల్‌ ఫీవర్‌తో బాధప డుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.

Updated Date - Sep 01 , 2024 | 10:31 PM

Advertising
Advertising