ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్‌హెచ్‌-63 అలైన్‌మెంట్‌ను మార్చాలి

ABN, Publish Date - Aug 27 , 2024 | 10:49 PM

నేషనల్‌ హైవే 63 విస్తరణలో భాగంగా రూపొందించిన మూడో అలైన్‌మెంట్‌ను మార్చాలని లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల రైతు లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రైతులకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులను కాల్చివేసి రెవెన్యూ అధికారుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.

formers dharna

ఏసీసీ, ఆగస్టు 27: నేషనల్‌ హైవే 63 విస్తరణలో భాగంగా రూపొందించిన మూడో అలైన్‌మెంట్‌ను మార్చాలని లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల రైతు లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రైతులకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులను కాల్చివేసి రెవెన్యూ అధికారుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. రైతులు మాట్లా డుతూ నేషనల్‌ హైవే 63 విస్తరించే ప్రతిపాదనలో భాగంగా 2018, 2023లో అధికారులు రెండు అలైన్‌ మెంట్లను రూపొందించారన్నారు. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూస్వాము లతో కుమ్మక్కై రెండు అలైన్‌మెం ట్లు కాకుండా 2024లో కొత్తగా మూడో అలైన్‌మెంట్‌ రూపొందిం చారన్నారు. లక్షెట్టిపేట పట్టణ బైపాస్‌ను సాకుగా చూపి అంతకు ముందు ఉన్న అలైన్‌మెంట్‌లను పూర్తిగా మార్చార న్నారు. కొత్తగా రూపొందించిన అలైన్‌మెంట్‌ వల్ల లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల్లో 500 మంది రైతులకు చెందిన 1400 ఎకరాల భూమి హైవే కింద పోతుందన్నారు. దీని వల్ల ప్రభు త్వంపై అదనంగా రూ.1500 కోట్ల భారం పడుతుందన్నారు.

మూడో అలైన్‌ మెంట్‌ను రైతులు వ్యతిరేకించినప్పటికి రెవెన్యూ అధికారులు అత్యుత్సా హం ప్రదర్శిస్తూ బలవంతంగా నోటీసులు అంటగడుతూ బ్యాంకు ఖాతా నెంబర్లు చెప్పాలని, భూములకు సంబంధించిన డబ్బులు జమ చేస్తామని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇప్పటికే తాము ఢిల్లీల్లో నేషనల్‌ హైవే అథారిటీ ఉన్నతాధికారులను కలిసి సమస్య వివ రించామని వారు పీడీని పంపి విచారిస్తామని తెలి పారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కూడా రైతులకు నష్టం కలుగ నివ్వనని హామీ ఇచ్చారని అయినప్పటికీ రెవెన్యూ అధికారులు రైతుల భూములను లాక్కునేందుకు పావులు కదుపుతు న్నారన్నారు. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు పోయాయని, ఒక ప్రాజెక్టులో భూము లు కోల్పోయిన వారి మిగులు భూములను మళ్ళీ సేకరించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమ న్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందించారు. రైతులు గుర్రాల శశిదర్‌రెడ్డి, అల్లి పర మేష్‌, జనార్దన్‌రెడ్డి, రాయమల్లు, ఒడ్నాల శ్యాంసుం దర్‌, మల్లేష్‌, గొల్లపల్లి మేఘన, కస్తూరి మల్లేష్‌, మహేష్‌, తిరుపతి, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 10:49 PM

Advertising
Advertising
<