అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి
ABN, Publish Date - Aug 29 , 2024 | 10:31 PM
అధికారులు ప్రజ లకు జవాబుదారీగా పనిచేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం ఆయన పట్ట ణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. 24వ వార్డు ఊరు మందమర్రి, 6వ వార్డు, నార్లాపూర్‌లో పాద యాత్ర, మరికొన్ని వార్డుల్లో ద్విచక్ర వాహనంపై వెళ్ళి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లా డుతూ పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలి టీలో అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలన్నారు.
మందమర్రి టౌన్, ఆగస్టు 29: అధికారులు ప్రజ లకు జవాబుదారీగా పనిచేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం ఆయన పట్ట ణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. 24వ వార్డు ఊరు మందమర్రి, 6వ వార్డు, నార్లాపూర్‌లో పాద యాత్ర, మరికొన్ని వార్డుల్లో ద్విచక్ర వాహనంపై వెళ్ళి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లా డుతూ పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలి టీలో అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహ రించాలని, వార్డుల్లో చెత్తా చెదారం నిల్వ ఉండ కుండా చూసుకోవాలన్నారు. ఎర్రగుంటపల్లె, ఊరు మందమర్రిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు మున్సి పాలిటీలో రూ.కోటి 50 లక్షలతో పనులు చేయాలని మున్సిపల్ ఇంజనీర్ అచ్చుత్‌ను ఆదేశించారు. ఎర్ర గుంటపల్లె వాగుపై వంతెన నిర్మాణం చేపట్టేందుకు అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయి స్తానని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటే శ్వర్లు, నాయకులు ఉపేందర్‌గౌడ్, సొత్కు సుదర్శన్, బండి సదానం దం, అబ్దుల్ అజీజ్, గుడ్ల రమేష్, మంద తిరుమల్, ఒడ్నాల కొమురయ్యపాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడు తూ కేటీఆర్ కావాలని తనపై బురద జల్లుతున్నా రని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. అక్రమ కట్టడాలను తొలగిస్తుంటే తన పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమ కట్టడాలపై ఎంతటి వారినైనా ఉపేక్షిం చకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్యలు చేపడు తున్నారని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
జైపూర్: ప్రజలకు మెరుగైన వైద్యం అందంచడ మే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వివేక్ వెం కటస్వామి పేర్కొన్నారు. వేలాలలో రూ.20 లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్‌సెంటర్‌ను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. తాగునీటి సమస్య పరిష్కా రానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్, డాక్టర్ శ్రావ్య, నాయకులు పాల్గొన్నారు.
భీమారం: రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. మండల కేంద్రంలో రూ.1.43 కోట్లతో నిర్మిం చనున్న పీహెచ్‌సీ నిర్మాణ పనులకు కలెక్టర్ కుమా ర్ దీపక్, డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌తో కలిసి శం కుస్ధాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభు త్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిం చడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రా లను ఏర్పాటు చేస్తోందన్నారు. మంచిర్యాల ప్రోగ్రాం ఆఫీసర్ అనిల్‌కుమార్, నాయకులు చేకుర్తి సత్య నారాయణరెడ్డి, పోడేటి రవి, గద్దె రాంరెడ్డి, మోహ న్‌రెడ్డి, అమర్‌సింగ్‌నాయక్, రవి, పాల్గొన్నారు.
మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మె ల్యే వివేక్‌వెంకటస్వామి కల్యాణలక్ష్మి చెక్కులను పం పిణీ చేశారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన నైతం బానయ్య కూలీ మృతిచెందగా ప్రభుత్వం మంజూ రు చేసిన రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును బానయ్య భార్యకు ఎమ్మెల్యే అందజేశారు.
Updated Date - Aug 29 , 2024 | 10:31 PM