ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

mancherial దా‘రుణ’ యాప్‌లు

ABN, Publish Date - Sep 13 , 2024 | 10:31 PM

ఆన్‌లైన్‌లో రుణాలు ఇస్తామంటూ సెల్‌ ఫోన్‌లకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. రుణం తీసుకుంటే వెంటనే మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని పేర్కొంటున్నారు. సాధారణ, మధ్య తరగతి ప్రజల అవసరాల కోసం వీటి ఉచ్చులో పడుతున్నారు. వారం, పది రోజుల వ్యవధికే తీసుకున్న రుణానికి అధిక వడ్డీలు కట్టాలంటూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.

బెల్లంపల్లి, సెప్టెంబరు 13: ఆన్‌లైన్‌లో రుణాలు ఇస్తామంటూ సెల్‌ ఫోన్‌లకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. రుణం తీసుకుంటే వెంటనే మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని పేర్కొంటున్నారు. సాధారణ, మధ్య తరగతి ప్రజల అవసరాల కోసం వీటి ఉచ్చులో పడుతున్నారు. వారం, పది రోజుల వ్యవధికే తీసుకున్న రుణానికి అధిక వడ్డీలు కట్టాలంటూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. అంత వడ్డీ చెల్లించక పోవడంతో వారి ఫోన్‌లో ఉన్న కాంటాక్టు నెంబర్లకు ఫోన్‌లు, మెసేజ్‌లు పంపిస్తూ భయపెడుతున్నారు. రుణాల వారు వేధిస్తుండడంతో మనసికంగా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.

- ఆన్‌లైన్‌ రుణాల పేరుతో ఉచ్చులోకి...

ఆన్‌లైన్‌ రుణాల పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారిని ఉచ్చులోకి దించుతున్నారు. వారి సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌ లింకులను పంపిస్తూ క్లిక్‌ చేస్తే వెంటనే మీ ఖాతాల్లో డబ్బులు జమవుతాయని తెలుపుతున్నారు. యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీకు ఆన్‌లైన్‌ ద్వారా రుణాలు పొందవచ్చని, క్షణాల్లో మీ ఖాతాల్లోకి డబ్బు వస్తుందని ఆశ పెడుతున్నారు. దీంతో ఆకర్షితులై కొందరు ఆన్‌లైన్‌ రుణాలను యాప్‌ల ద్వారా తీసుకుంటున్నారు. యాప్‌ల ద్వారా రుణం తీసుకున్న వారికి వడ్డీ అడ్డూ అదుపు లేకుండా ఉంటుంది. రూ.7 వేలు రుణం తీసుకున్న వ్యక్తి కేవలం 15 రోజుల్లోనే రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రుణం తీసుకున్నది కొంతైతే కొంచం ఆలస్యమైనా వడ్డీకి వడ్డీ పేరుతో అసలు కంటే వడ్డీ రెండింతలయ్యేలా చేసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆన్‌లైన్‌ రుణాల పేరుతో వందల యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఈ యాప్‌ల ద్వారా ఎలాంటి డాక్యుమెంట్లు, షూరిటీలు లేకుండా రుణాలు తీసుకునే సదుపాయం ఉండడంతో యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని రుణాలు తీసుకుంటున్నారు. రుణం తీసుకున్న వ్యక్తే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న సమయంలో ఫోన్‌లోని ఫొటోలు, కాంటాక్టు లిస్టు వంటి వాటికి పర్మిషన్‌లు ఇవ్వడంతో డాటా ఆన్‌లైన్‌ రుణాలు ఇచ్చే వారికి చేరుతోంది.

-మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న వైనం

ఆన్‌లైన్‌ యాప్‌లో రుణాలు తీసుకుని కట్టలేని పరిస్థితి వస్తే అప్పటికే సదరు వ్యక్తి ఫోన్‌ కాంటాక్టు నెంబర్లు, ఫోన్‌లోని సమాచారం ఉంటుంది. దీంతో రుణం తీసుకున్న వ్యక్తి కాంటాక్టు లిస్టులోని ఫోన్‌ నెంబర్లలోని బంధువులు, కుటుంబీకులకు ఫోన్‌ చేసి రుణం తీసుకోవడం లేదని ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తారు. చివరకు ఫొటోలు సైతం అశ్లీలంగా మార్ఫింగ్‌ చేస్తూ వారి కుటుంబీకులకు, బంధువులకు షేర్‌ చేస్తారు. ఫోన్‌ ముట్టడానికే భయపడే విధంగా రోజు వివిధ నెంబర్లతో ఫోన్‌ చేస్తూ చివరకు జీవితంపై విరక్తి వచ్చే విధంగా చేస్తారు. ఒత్తిడి, వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆత్మహత్యలు చేసుకుంటున్న జిల్లా వాసులు

- మంచిర్యాల పట్టణంలోని గోపాల్‌వాడకు చెందిన వివాహిత కళ్యాణి లోన్‌ యాప్‌ సంస్థ వేధింపులు భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయినప్పటికీ రుణ యాప్‌ నిర్వాహకులు మృతదేహం ఫొటో పంపాలని కుటుంబీకులను ఒత్తిడికి గురి చేశారు.

- దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్‌ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రూ.50 వేల రుణం తీసుకున్నాడు. వడ్డీ, చక్రవడ్డీ పేరుతో నిర్వాహకులు రూ.7 లక్షలు తిరిగి చెల్లించాలని వేధిం చాడు. అంతమొత్తం చెల్లించలేనని నిర్వాహకులకు చెప్పడంతో ఫొటోలు న్యూడ్‌గా మార్ఫింగ్‌ చేసి బంధువులు, స్నేహితులకు పంపిస్తామని బెది రింపులకు గురి చేశారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

- నస్పూర్‌కు చెందిన శ్రీకాంత్‌ లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకు న్నాడు. రుణం తీసుకున్న డబ్బులను స్టాక్‌ మార్కెటింగ్‌ ట్రేడింగ్‌లో పెట్టాడు. ట్రేడింగ్‌లో నష్టాలు రావడంతో అప్పు చెల్లించలేదు. దీంతో అప్పులు చెల్లించాలని మానసిక ఒత్తిడికి గురి చేయడంతో శ్రీకాంత్‌ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

- జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు లోన్‌యాప్‌ ద్వారా రూ.10 వేలు రుణం తీసుకున్నాడు. వడ్డీతో కలిసి రూ.30 వేలు చెల్లించాడు. ఇంకా డబ్బులు కట్టాలంటూ రోజుకు వివిధ నెంబర్ల నుంచి ఫోన్‌లు చేసి వేధింపులకు గురిచేశారు. దీంతో కుటుంబీకులు, బంధువులు, స్నేహితు లకు తెలిస్తే పరువుపోతుందని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

- జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి రుణయాప్‌ల ద్వారా లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. డబ్బులను ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, స్టాక్‌మార్కెట్‌లలో పెట్టి నష్టపోయాడు. దీంతో రుణయాప్‌ల వేధింపులు తట్టుకోలేక భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.

యాప్‌లలో రుణాలు తీసుకోవద్దు

బన్సీలాల్‌, సీఐ, మంచిర్యాల

చిన్న చిన్న అవసరాలకు లోన్‌ యాప్‌లను ఆశ్రయించవద్దు. అడిగినంత డబ్బు ఇచ్చి సమస్యల్లో పడేయడమే రుణయాప్‌ నిర్వాహకుల వ్యూహం. వారి వలలో పడి సమస్యల్లో చిక్కుకోవద్దు. రుణయాప్‌లలో లోన్‌ తీసుకుంటే యాప్‌ నిర్వాహకుల ఫోన్‌లు, మెసెజ్‌ల ద్వారా కుటుంబీకులకు, స్నేహితులకు ఫోన్‌లు చేస్తూ వేధిస్తే భయపడవద్దు. అలాంటి ఫోన్‌లు వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలి. భయాందోళనలకు గురై క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు.

Updated Date - Sep 13 , 2024 | 10:31 PM

Advertising
Advertising