ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్తములుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకే సాధ్యం

ABN, Publish Date - Sep 05 , 2024 | 10:43 PM

విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ భావి తరాలను తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకే సాధ్యమని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి పురస్కరిం చుకుని గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినో త్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 5: విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ భావి తరాలను తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకే సాధ్యమని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి పురస్కరిం చుకుని గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినో త్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వేపల్లి జయంతి సందర్భంగా ఉపాధ్యా యులను సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గురువులు నేర్పిన పాఠాలు చాలా బలంగా ఉంటాయని తెలిపారు. అనేక మంది ఉన్నత స్థాయిలో నిలవడంలో ఉపాధ్యాయులు బోధించిన పాఠాలే మూల మని, ఉపాధ్యాయులు, పిల్లలు ఎక్కువ సమ యం పాఠశాలల్లోనే గడుపుతారన్నారు. ఎం తో మంది మేధావులకు ఉపాధ్యాయులే ఆద ర్శమన్నారు. 43 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందర్ని అలరించాయి. డీఈవో యాదయ్య, జెడ్పీసీఈవో గణపతి, వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ ది నోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ నరేం దర్‌రెడ్డి సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అధ్యాపకులు హరీష్‌కుమార్‌, గంగయ్య, కుమారస్వామి, గోపాలకృష్ణ, రాజయ్య, కనకలక్ష్మీ, కరుణా కర్‌, రాజు, అరుణ పాల్గొన్నారు. విజయం టీచర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉ పాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. సరిత, శిరీష్‌, శైలజ, వంశీకృష్ణ, పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 10:43 PM

Advertising
Advertising