ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

mancherial రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN, Publish Date - Nov 12 , 2024 | 10:22 PM

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్‌రాజ్‌ అన్నారు. మంగళవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో తాండూర్‌, తాల్లగురిజాల, నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బెల్లంపల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్‌రాజ్‌ అన్నారు. మంగళవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో తాండూర్‌, తాల్లగురిజాల, నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. మందులకు సంబంధించి ఎక్స్‌పైరీ డేట్‌ను చూడాలని, ఆరోగ్య కేంద్రాల్లో ఎప్పటికప్పుడు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హైరిస్క్‌ గర్భవతులను జిల్లా ఆసుపత్రికి, లేదా మాతా శిశు కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతకుముందు వంద పడకల ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. వార్డులను తనిఖీ చేసి వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుధాకర్‌నాయక్‌, అనిత, ప్రసాద్‌, ఎస్‌వో వెంకటేశ్వర్లు, సీఎస్‌వో బుక్కా వెంకటేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 10:22 PM