ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి

ABN, Publish Date - Oct 18 , 2024 | 10:33 PM

మూడేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో విద్యార్థులతో పాటు యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

బెల్లంపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మూడేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో విద్యార్థులతో పాటు యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడంతో విద్యారంగం కుంటు పడుతుందన్నారు. విద్యాసంస్థను నిర్లక్ష్యం చేసేలా ప్రభుత్వం అడుగులు వేయడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు.

కళాశాల మూసివేతలతో విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపివేయాల్సిన దుస్థితి ఎదురవుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థి సంఘాల నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్‌, అల్లి సాగర్‌, దీపక్‌కుమార్‌, శ్రీకాంత్‌, పసులేటి వెంకటేష్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 10:33 PM