క్రీడలతో శారీరక, మానసిక వికాసం
ABN, Publish Date - Nov 30 , 2024 | 10:42 PM
క్రీడ లతో విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. రెబ్బనపల్లి ఉన్నత పాఠశాల ఆవ రణలో 68వ రాష్ట్రస్థాయి అండర్-17 బాల బాలి కల బీచ్ వాలీబాల్ పోటీలను డీఈవో యాద య్యతో కలిసి ఎమ్మెల్యే టాస్ వేసి ప్రారంభిం చారు.
దండేపల్లి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): క్రీడ లతో విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. రెబ్బనపల్లి ఉన్నత పాఠశాల ఆవ రణలో 68వ రాష్ట్రస్థాయి అండర్-17 బాల బాలి కల బీచ్ వాలీబాల్ పోటీలను డీఈవో యాద య్యతో కలిసి ఎమ్మెల్యే టాస్ వేసి ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా ర్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. గ్రామీ ణ ప్రాంతాల నుంచి మంచి క్రీడాకారులను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌జీఎఫ్ పోటీలను నిర్వహిస్తోందన్నారు.
పోటీల్లో ఉమ్మడి 10 పాత జిల్లాలోని 60మంది క్రీడాకారులు, 20మంది కోచ్‌లు, పీడీ, పీఈటీలు హాజరయ్యారు. పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఎంపిక చేసి ఒడిశా లోని పూరీలో జరిగే పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా స్కూల్ గ్రేమ్స్ ఫెడరేషన్ నిర్వాహకులు తెలి పారు. కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ దాసరి ప్రేమ్‌చందు, స్కూల్ గ్రేమ్స్ ఫెడరే షన్ జిల్లా కార్యదర్శి ఫణిరాజా, తహసీల్దార్ సం ధ్యరాణి, ఎంపీడీవోప్రసాద్, హెచ్‌ఎం మంత్రి రాజు, మాజీ జెడ్పీటీసీ గడ్డం నాగరాణిత్రిమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
గర్మిళ్ల, (ఆంధ్రజ్యోతి): రెబ్బెనపల్లిలోని జెడ్పీ హెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్ 17న బాల బాలికల వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదు వుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. పాత పది జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు, 20 మంది కోచ్‌లు, 20 మంది పీడీలు పాల్గొన్నారు. డీఈవో యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్‌చంద్, నాగరాణి, శ్రీనివాస్, కళ్యాణి, మురళీకృష్ణ, అశోక్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ ఫణిరాజా పాల్గొన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 10:42 PM