ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాపం శునకాలు...!

ABN, Publish Date - Nov 07 , 2024 | 10:45 PM

వీధి శునకా లకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయడం ద్వారా వాటి వ్యాప్తిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అం డాళమ్మ కాలనీ సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పశు సంరక్షణ కేంద్రం పేరుతో ఆస్పత్రి భవనాన్ని నిర్మిం చారు.

మంచిర్యాల, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వీధి శునకా లకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయడం ద్వారా వాటి వ్యాప్తిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అం డాళమ్మ కాలనీ సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పశు సంరక్షణ కేంద్రం పేరుతో ఆస్పత్రి భవనాన్ని నిర్మిం చారు. ఇందులో డాక్టర్‌ గది, ఆపరేషన్‌ థియేటర్‌తోపాటు శునకాలను ఉంచేందుకు రెండు గదులను నిర్మించారు. నిర్వహణ బాధ్యతలను హైద్రాబాద్‌లోని ఎనిమిల్‌ వెల్ఫేర్‌ సొసైటీ దక్కించుకుంది. ఆస్పత్రిలో ప్రస్తుతం ఒక వెటర్నరీ డాక్టర్‌తోపాటు ఇద్దరు వెటర్నరీ అసిస్టెంట్లు, ఒక వాచ్‌మన్‌, శునకాలకు ఆహారం వండి పెట్టేందుకు కుక్‌, హెల్పర్‌ను ఏజెన్సీ నియమించింది. ఆస్పత్రి భవనం పూర్తికావడంతో ఈ ఏడాది మార్చి 13న ప్రారంభించారు. అనంతరం ఏప్రిల్‌ నుంచి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి వీధి కుక్కలను తీసుకొస్తున్నారు. శునకాలను పట్టి తెచ్చేం దుకు (డాగ్‌ క్యాచర్లు) ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను నియమించారు. శస్త్ర చికిత్స అనంతరం వారం రోజులపాటు వాటిని అబ్జర్వేషన్‌లో ఉంచి, తరువాత ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలి పెడతారు.

రెండు నెలలుగా వేతనాలు బంద్‌...

ఆస్పత్రిలో సిబ్బందికి ఏజెన్సీ రెండు నెలలుగా వేత నాలు ఇవ్వడం లేదు. డాక్టర్‌కు నెలకు రూ. 35వేలు, వాచ్‌మన్‌, కుక్‌, హెల్పర్‌ ఒకొక్కక్కరికి రూ.12వేలు, వెటర్నరీ అసిస్టెంట్‌కు రూ.16వేల చొప్పున వేతనాలు చెల్లించేందుకు ఏజెన్సీ అంగీకరించింది. ఐదు నెలలపాటు ఆగస్టు వరకు సక్రమంగా వేతనాలు చెల్లించినప్పటికీ సెప్టెంబరు, అక్టోబరు మాసాలకు సంబంధించి రెండు నెలల వేతనాలు పెండింగులో ఉన్నాయి. దీంతో వేతనాల కోసం సిబ్బంది ఏజెన్సీపై ఒత్తిడి తేవడంతో డాక్టరు మినహా 10 రోజుల క్రితం మిగతా సిబ్బందిని మూకు మ్మడిగా విధుల్లో నుంచి తొలగించింది.

నిలిచిన శస్త్ర చికిత్సలు...

ఆస్పత్రిలో వైద్యుడు మినహా సిబ్బంది లేకపోవడంతో శునకాలకు శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. ఈ సమాచా రాన్ని వైద్యుడు సదరు ఏజెన్సీకి తెలియజేయడంతో డాగ్‌ క్యాచర్లతో సర్దుకుపోవాలని తెలిపాడు. శస్త్ర చికిత్స చేసే ముందు శునకాలకు మత్తు ఇంజక్షన్‌ (అనస్థీషియా) ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు శిక్షణ పొందిన వెటర్నరీ అసిస్టెంట్లు అందుబాటులో ఉండాలి. వారిని విధుల్లో నుంచి తొలగించడంతో కాంట్రాక్టరు సూచన మేరకు డాగ్‌క్యాచర్లతో అనస్థీషియా చేయించారు. దీంతో ఇం జక్షన్‌ వికటించి వారం రోజుల క్రితం మూడు శునకాలు మరణించగా, వాటిని బయట పడవేశారు. ఈ విషయం వెలుగులోకి రాలేదు. అప్పటి నుంచి శస్త్ర చికిత్సలు నిలిచిపోగా సిబ్బంది లేక ఆహార పానియాలు కూడా అందడం లేదు.

మరో ఐదు శునకాలు మృత్యువాత...

శునకాలకు ఆహార పానియాలు అందించే వారు లేక ఐదు శునకాలు పస్తులతో మృత్యువాత పడ్డాయి. ఆస్పత్రి ఆవరణంతా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. మరణించిన శునకాల కళేబరాలు కూడా తొలగించకపో వడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా దుర్గంధం వెదజల్లు తోంది. విధుల్లో నుంచి తొలగించిన సిబ్బంది వేతనాల కోసం ఏజెన్సీతో మాట్లాడేందుకు గురువారం ఆస్పత్రికి వెళ్ళారు. దుర్వాసన రావడంతో గదుల్లో పరిశీలించగా ఐదు శునకాలు మృతి చెంది ఉండటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరికొన్ని శునకాలు కొన ఊపిరితో ఉన్నాయని తెలిపారు.

Updated Date - Nov 07 , 2024 | 10:45 PM