ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చేప పిల్లల పంపిణీకి ప్రణాళిక

ABN, Publish Date - Sep 22 , 2024 | 10:37 PM

ఎట్టకేలకు చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మత్య్సకారులకు ఉపాధిని కల్పించడానికి ఇప్పటికే జిల్లాలో చెరువులు, కుంటల, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వేయాల్సి ఉండగా ఆలస్యమైంది. టెండర్‌ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో చేప పిల్లల పంపిణీ మత్య్స శాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించారు.

నస్పూర్‌, సెప్టెంబరు 22: ఎట్టకేలకు చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మత్య్సకారులకు ఉపాధిని కల్పించడానికి ఇప్పటికే జిల్లాలో చెరువులు, కుంటల, ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వేయాల్సి ఉండగా ఆలస్యమైంది. టెండర్‌ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో చేప పిల్లల పంపిణీ మత్య్స శాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 372 చెరువులు, కుంటలు, తొమ్మిది చిన్న, మద్య తరహా ప్రాజెక్టుల్లో 2.18 కోట్ల చేప పిల్లలను వదిలి పెట్టడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో ఇప్పటికే చాలా చోట్ల మత్య్సకారులు చేప పిల్లలను చెరువుల్లో వేసుకున్నారు. ఆలస్యంగా వేయడం వలన చేప ఆశించిన విధంగా ఎదగదని మత్య్సకారులు అంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో చేప పిల్లల పంపిణీపై మత్య్సకారులు పెద్దగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.

జిల్లాలో ఎక్కడెక్కడ...

జిల్లాలో 18 మండలాలు, 311 గ్రామ పంచాయతీల పరిధిలో 372 కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు ఎల్లంపల్లి, సుందిళ్ళ, అన్నారంలతో మరో మూడు చిన్న తరహా ప్రాజెక్టులు ర్యాలీ వాగు, నీల్వాయి వాగు, గొల్లవాగులున్నాయి. 125 మత్య్స సహకార సంఘాలుండగా దాదాపు ఏడు వేల వరకు సభ్యులు కొనసాగుతున్నారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో రవ్వు, బొచ్చ, బంగారు తీగ చేప పిల్లలను వేస్తారు. జూలై, సెప్టెంబరు మాసాల్లో చేప పిల్లలను వదిలిపెట్టాల్సిన ప్రక్రియ ఆలస్యమైంది. పిల్లలు రెండుమూడు కిలోలు, ఇంతకంటే ఎక్కువ రావడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండు మాసాల సమయం పట్టే అవకాశం ఉంటుంది.

నెలాఖరులో చేప పిల్లల పంపిణీ- జె. భాస్కర్‌- మత్య్స శాఖ జిల్లా అధికారి

జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఈ నెలాఖరు లేదా అక్టోబరు మొదటి వారంలో చేపడుతాం. ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా పంపిణీ ప్రక్రియకు నెలన్నర సమయం పడుతోంది.

Updated Date - Sep 22 , 2024 | 10:37 PM