పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి
ABN, Publish Date - Dec 16 , 2024 | 10:19 PM
పోలీసులు గ్రామీణ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. నెన్నెల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం డీసీపీ భాస్కర్‌తో కలిసి పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.
నెన్నెల, డిసెంబరు16(ఆంధ్రజ్యోతి) : పోలీసులు గ్రామీణ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. నెన్నెల పోలీస్‌స్టేషన్‌ను సోమవారం డీసీపీ భాస్కర్‌తో కలిసి పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, మావోయిస్టుల ప్రభావం, వారి కుటుంబ సభ్యుల పరిస్థితులు, సానుభూతిపరుల గురించి ఆరా తీశారు. ఎక్కువగా జరుగుతున్న నేరాలు, రౌడి షీటర్లు, సస్పెక్ట్ షీట్ల వివరాలను ఎస్సై ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సలహాలు, సూచనలిచ్చారు. ప్రతి గ్రామాన్ని తప్పకుండా సందర్శించాలని, పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు. సమస్య తీవ్రతను బట్టి ఆయా శాఖల అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, సజావుగా ఎన్నికలు జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విజబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఉన్నారు.
బెల్లంపల్లి హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన సీపీ
బెల్లంపల్లి, (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి హెడ్‌క్వార్టర్స్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్‌లు సందర్శించారు. ఆర్ముడ్ సిబ్బంది గౌరవ వదనం స్వీకరించి హెడ్ క్వార్టర్ట్స్, ఆర్‌ఐ ఆఫీస్‌లను పరిశీలించారు. సిబ్బంది, డ్యూటీల వివరాలు తెలుసుకున్నారు. హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఐపీఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఆర్‌ఐ శ్రీనివాస్, సంపత్‌లు పాల్గొన్నారు.
Updated Date - Dec 16 , 2024 | 10:19 PM