ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇందిరమ్మ ఇళ్లకు విధి విధానాలు

ABN, Publish Date - Nov 04 , 2024 | 10:50 PM

ఇందిరమ్మ ఇళ్ల పథకం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో సొంత ఇంటి కోసం ఎదరుచూస్తున్న నిరు పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల విష యంలో సొంత స్థలం ఉన్నవారికి మొదట ప్రాధాన్యం ఇవ్వనుండగా, లేనివారికి 75 గజాల స్థలం ఇవ్వనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

మంచిర్యాల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో సొంత ఇంటి కోసం ఎదరుచూస్తున్న నిరు పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల విష యంలో సొంత స్థలం ఉన్నవారికి మొదట ప్రాధాన్యం ఇవ్వనుండగా, లేనివారికి 75 గజాల స్థలం ఇవ్వనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా....

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విధి విధా నాలను మంత్రి ప్రకటించడంతో ఇళ్ల మంజూరుకు మార్గం సుగమమైంది.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల విష యంలో చేసిన తప్పులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పునరావృతం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ మైన, అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీలో అప్పటి ప్రజా ప్రతినిధుల జోక్యం పెరగడంతో పథకం వివాదాస్పదమెంది. దీంతో అక్కడ క్కడ కొన్ని ఇళ్లు పంపిణీకి నోచుకోగా, అధిక భాగం వృథాగా ఉన్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ, పట్టణ సభల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి మంజూరు చేయనున్నారు.

నియోజకవర్గానికి 3500 ఇళ్లు....

జిల్లాలో ఇళ్లు లేనివారి సంఖ్య వేలల్లోనే ఉంది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఖానాపూర్‌ నియోజకవర్గంలోని జన్నారం మండలం కూడా జిల్లా పరిధిలోకే వస్తుంది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియో జకవర్గాలతోపాటు జన్నారం మండలానికి మొత్తం సుమారు 11వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యే అవకాశాలున్నాయి. వాటికి తోడు రిజర్వుడ్‌ కోటా కింద మరికొన్ని ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేయనుంది. కలెక్టర్‌తోపాటు ఇన్‌చార్జి మంత్రి ఆధీనంలో ఉంటాయి. అవసరాన్ని బట్టి అర్హులైన వారికి వాటిని అప్పటికప్పుడు మంజూరు చేసే వెసలుబాటు కల్పించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, స్థలాల కోసం 2,10,206 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 20న తుది జాబితా విడుదల చేయనున్నారు.

ఎంపిక బాధ్యత తహసీల్దార్లదే

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తుది నిర్ణయాన్ని ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించింది. ఎంపిక ప్రక్రియ మొదట ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఉంచాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, వివాదం నెలకొంటుందనే ఉద్దేశ్యంతో తహసీల్దార్లకు అప్పగించింది. ఎమ్మెల్యేల పరిధిలో ఉంటే ఆయా గ్రామాల్లో ద్వితీయశ్రేణి నాయకులు తమకు అనుకూలంగా ఉండే వారికి ఇళ్లు కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతో అర్హులకు ఇళ్లు అందుతాయో లేదోనన్న సందేహాలు వచ్చాయి. దీంతో తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రేషన్‌కార్డు తప్పనిసరి కాదు

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రేషన్‌ కార్డు తప్పనిసరి కాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే ప్రజా పాలనలో మహిళల పేరుతో వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇళ్ల మంజూరు వివిధ వర్గాలకు రిజర్వేషన్‌ దామాషాన జరుగనుంది. దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు 10, బీసీ మైనార్టీలకు 50, జనరల్‌ కోటాలో 15 శాతం ఇళ్లు కేటాయించనున్నారు. శిథిలావస్థలో ఇల్లు ఉండి, పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు ఇంటి పన్ను రశీదు, విద్యుత్‌ బిల్లు చూపాల్సి ఉంటుంది. సొంత స్థలం కలిగి ఉన్న వారికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం, లేని వారికి 75 గజాల స్థలంతో పాటు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంజూరు పత్రాలు అందిన తరువాత ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకోవచ్చు. బేస్‌మెంట్‌ లెవల్లో రూ.లక్ష, పిల్లర్ల లెవల్లో రూ.1.25 లక్షలు, స్లాబ్‌ లెవల్లో రూ. 1.75 లక్షలు, నిర్మాణం పూర్తయిన తరువాత రూ.లక్ష నగదు చెల్లించ నున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా? కాదా? అనే విషయాన్ని అధికారులు పరిశీలించి ఖరారు చేయనున్నారు. ప్రస్తుత ప్రదేశంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు..? అనే వివరాలతోపాటు ఇంటి స్థలం ఉన్నవారైతే సదరు స్థలం సొంతమేనా? దాని స్వభావం, ఎలా సంక్రమించింది? అనే వివరాలను తీసుకోనున్నారు. ఆ తరువాతనే పథకం మంజూరు కానుంది.

Updated Date - Nov 04 , 2024 | 10:50 PM